బాలీవుడ్ స్టార్ హీరోతో వెంకటేష్
గురు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గురు తరువాత వేరే ఏ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పని వెంకీ కొంత గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడు. గురు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వెంకటేష్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై స్పందించాడు. ప్రస్తుతానికి ఎలాంటి కమిట్ మెంట్స్ లేకపోయినా ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్లో నటించే ఉద్దేశం ఉన్నట్టుగా తెలిపాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనకు మంచి మిత్రుడన్న వెంకీ, వీలైతే తనతో ఓ బాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తానని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ కోసం ఎలాంటి వర్క్ జరగకపోయినా. అవకాశం ఉంటే మాత్రం సల్మాన్ తో నటించేందుకు తాను సిద్ధమని తెలిపాడు వెంకీ. వెంకీ లీడ్ రోల్ లో సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన గురు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.