సెట్స్‌లో సందడి గురూ!
‘‘వెంకటేశ్‌గారితో కలసి నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నిజంగా ‘విక్టరీ’నే. ‘గురు’ షూటింగ్‌లో వెంకీతో ఓ సెల్ఫీ’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు ముంతాజ్ సోర్కర్. ఎవరీ ముంతాజ్ అనుకుంటున్నారా? ఇక్కడ వెంకటేశ్ పక్కన ఆరెంజ్ కలర్ జెర్సీలో కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీ తీసుకున్న అమ్మాయే. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘గురు’లో హీరోయిన్ రితికా సింగ్‌కి సిస్టర్‌గా నటిస్తున్నారు.
మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన ‘సాలా ఖడూస్’కి తెలుగు రీమేక్ ఈ ‘గురు’ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌లో కూడా ముంతాజ్ హీరోయిన్ సిస్టర్‌గా నటించారు. ప్రస్తుతం విశాఖలో ‘గురు’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం లొకేషన్‌కి వచ్చిన అభిమానులతో వెంకీ ఫొటోలు దిగారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో పూర్తవుతుంది.