మంచిమాట
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్‌నీ, డ్రైవర్‌నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.
అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?
గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా?
ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు.
బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ?
అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా!
ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి?
– డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment