
ముంబై: దివంగత ఇన్వెస్ట్‌మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు.
2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు.
జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా
ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment