దివంగత పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝన్ ఝన్‌వాలా తన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దు కునేందుకు కలలు కన్నారు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్‌లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం, మలబార్ హిల్స్ ప్రాంతంలో 14-అంతస్తుల విశాలమైన బంగ్లా నిర్మాణం పూర్తి చేయకముందే కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో 2022 ఆగస్టులో కన్నుమూశారు.
2016-2017 మధ్య కాలంలో రిడ్జ్‌వే అపార్ట్‌మెంట్స్ అనే మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 371 కోట్లు వెచ్చించిన బిగ్ బుల్ ఝున్‌ఝన్‌వాలా. 2013 సంవత్సరంలో 6 ఫ్లాట్‌లను స్టాండర్డ్ చార్టర్డ్ నుండి రూ. 176 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన 6 ఫ్లాట్‌లను కొనుగోలు చేసేందుకు వేచి చూసి మరీ నాలుగేళ్ల తర్వాత, రూ. 195 కోట్లకు అత్యధికంగా బిడ్ చేసి మరీ సొంతం చేసుకున్నారు. (యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే! )
ఇటీవల ట్విటర్ యూజర్ ఝన్‌ఝన్‌వాలా ఇంటికి చెందిన సీఫేస్‌టెర్రస్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా మారింది. ఆర్‌జే అని స్నేహితులు ప్రేమగా పిలుచుకునే ఝన్‌ఝన్ వాలా అభిరుచిని గుర్తు చేసుకున్నారు. అబ్బురపరిచే ఈ బంగ్లా జీవితం పట్ల ఆర్‌జేకు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
మీడియా నివేదికల ప్రకారం ఈ బంగ్లా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రేస్‌లో ఆరు-సీట్ల డైనింగ్ టేబుల్, బార్, అవుట్‌డోర్ సీటింగ్ ఏరియాలు, పచ్చటి గడ్డి కార్పెట్, పచ్చదనంతో చక్కగా ఉండది. అలాగే నాలుగో అంతస్తులో పార్టీల కోసం బాంకెట్ హాల్, ఎనిమిదో అంతస్తులో జిమ్, స్టీమ్ రూమ్, స్పా , ప్రైవేట్ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. బాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, 5వ అంతస్తులో భారీ హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి. పై అంతస్తు 70.24 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్జర్వేటరీ ఏరియా, రీ-హీటింగ్ కిచెన్, పిజ్జా కౌంటర్, అవుట్‌డోర్ సీటింగ్ స్పేస్, వెజిటబుల్ గార్డెన్‌గా రూపొందించారు. మిగిలినదాన్ని కుటుంబంకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 10వ అంతస్తులో 4 పెద్ద గెస్ట్ బెడ్‌రూమ్ లున్నాయి. ఇక్కడ పిల్లలు కుమార్తె నిషిత, కవల కుమారులు ఆర్యమాన్ , ఆర్యవీర్ కోసం 11వ అంతస్తులో లగ్జరీ బెడ్ రూంలు ఉండేలా ప్లాన్ చేశారు.
Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB
— Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023
తన కోసం పెద్ద బెడ్‌రూం
స్టాక్ మార్కెట్ లెజెండ్ ఝున్‌ఝన్‌వాలాతన భార్య రేఖతో కలిసి 12వ అంతస్తులో విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలతో మాస్టర్ బెడ్‌రూమ్ తయారు చేయించుకున్నారు. ఇది సగటు 2BHK కంటే 20 శాతం పెద్దది. అలాగే బాత్రూమ్ ముంబైలో విక్రయించే సగటు 1 BHK అంత పెద్దది. ఇక భోజనాల గది 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ కంటే పెద్దది. అంతేకాదు చిన్నప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అమెరికా బడా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్‌లను తన ఇంట్లో విందుకు ఆహ్వానించాలనే కోరిక ఉండేదిట. వీటితోపాటు, తన కలల ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన కన్నుమూయడం విషాదం.
Comments
Please login to add a commentAdd a comment