Dream House
-
కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. కొనుగోలు ప్రాధమ్యాలివే.. ♦ ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం ఇష్టపడుతున్నారు. ♦ చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆల నాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండా లని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలే ని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ♦ ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రా«ధమ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌక ర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. ♦ వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. -
దీవినే నిర్మించకున్న జంట! ఏకంగా రూ. 16 కోట్లు..!
ఖాళీగా ఉన్న దీవుల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటారు. అదంత విశేషం కాదు. కెనడాకు చెందిన ఒక జంట తమ కోసం ఏకంగా దీవినే నిర్మించుకున్నారు. వాంకోవర్ పడమటి తీరంలో ఈ దీవిని నిర్మించుకోవడానికి వాళ్లు ఇరవై ఏడేళ్లు అహరహం శ్రమించారు. వేన్ ఆడమ్స్, కేథరీన్ కింగ్ అనే దంపతులు అన్నీ వదిలిపెట్టి 1992లో వాంకోవర్‌కు చేరువలోని జనసంచారం లేని తీరప్రాంతానికి వలస వచ్చేశారు. రెక్కల కష్టంతోనే అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇంటి పరిసరాల్లో పంటలు పండించుకోవడం, చేపల వేటతోనే స్వయంసమృద్ధి సాధించుకున్నారు. క్రమంగా మరికొన్ని కట్టడాలను నిర్మించుకుని, తమ పరిధిని విస్తరించుకున్నారు. తోటలను ఏర్పాటు చేసుకున్నారు. వినోదం కోసం ఆరుబయట నృత్యవేదికను కూడా నిర్మించుకున్నారు. సొంతంగా ఒక దీవిని నిర్మించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో, ఇరవై ఏడేళ్ల కిందట ఆ దిశగా పనులు ప్రారంభించారు. తుఫానుల్లో కొట్టుకొచ్చిన కలప దుంగలు, చేపల వేట కోసం ఉపయోగించే వలలు, తాళ్లు మాత్రమే ఉపయోగించి, నీటిపై తేలియాడే చక్కని ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కృత్రిమ దీవిలో నివాసమే కాకుండా, ఇందులోనే తమకు కావలసిన పంటలు పండించుకోవడానికి కూడా పూర్తి వసతులను ఏర్పాటు చేసుకున్నారు. తమదైన దీవిని తయారు చేసుకోవడానికి వారు దాదాపు ఒక మిలియన్ పౌండ్లు (రూ.10.32 కోట్లు) ఖర్చు చేశారు. ఈ దీవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..ఏకంగా రూ. 914 కోట్లు!ముఖేశ్అంబానీ కూతురు మాత్రం కాదు!) -
దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా లగ్జరీ బంగ్లా: ఎన్ని అంతస్తులో తెలుసా?
దివంగత పెట్టుబడిదారుడు, బిలియనీర్ రాకేష్ ఝన్ ఝన్‌వాలా తన డ్రీమ్ హౌస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దు కునేందుకు కలలు కన్నారు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్‌లా ముంబైలోని ఖరీదైన ప్రాంతం, మలబార్ హిల్స్ ప్రాంతంలో 14-అంతస్తుల విశాలమైన బంగ్లా నిర్మాణం పూర్తి చేయకముందే కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో 2022 ఆగస్టులో కన్నుమూశారు. 2016-2017 మధ్య కాలంలో రిడ్జ్‌వే అపార్ట్మెంట్స్ అనే మొత్తం భవనాన్ని కొనుగోలు చేయడానికి రూ. 371 కోట్లు వెచ్చించిన బిగ్ బుల్ ఝున్‌ఝన్‌వాలా. 2013 సంవత్సరంలో 6 ఫ్లాట్లను స్టాండర్డ్ చార్టర్డ్ నుండి రూ. 176 కోట్లకు కొనుగోలు చేశారు. మిగిలిన 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు వేచి చూసి మరీ నాలుగేళ్ల తర్వాత, రూ. 195 కోట్లకు అత్యధికంగా బిడ్ చేసి మరీ సొంతం చేసుకున్నారు. (యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే! ) ఇటీవల ట్విటర్ యూజర్ ఝన్‌ఝన్‌వాలా ఇంటికి చెందిన సీఫేస్టెర్రస్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేశారు. దీంతో వైరల్‌గా మారింది. ఆర్జే అని స్నేహితులు ప్రేమగా పిలుచుకునే ఝన్‌ఝన్ వాలా అభిరుచిని గుర్తు చేసుకున్నారు. అబ్బురపరిచే ఈ బంగ్లా జీవితం పట్ల ఆర్జేకు ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ బంగ్లా 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. టెర్రేస్‌లో ఆరు-సీట్ల డైనింగ్ టేబుల్, బార్, అవుట్డోర్ సీటింగ్ ఏరియాలు, పచ్చటి గడ్డి కార్పెట్, పచ్చదనంతో చక్కగా ఉండది. అలాగే నాలుగో అంతస్తులో పార్టీల కోసం బాంకెట్ హాల్, ఎనిమిదో అంతస్తులో జిమ్, స్టీమ్ రూమ్, స్పా , ప్రైవేట్ థియేటర్ తదితర సౌకర్యాలున్నాయి. బాంక్వెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, జిమ్, 5వ అంతస్తులో భారీ హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి. పై అంతస్తు 70.24 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కన్జర్వేటరీ ఏరియా, రీ-హీటింగ్ కిచెన్, పిజ్జా కౌంటర్, అవుట్డోర్ సీటింగ్ స్పేస్, వెజిటబుల్ గార్డెన్‌గా రూపొందించారు. మిగిలినదాన్ని కుటుంబంకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 10వ అంతస్తులో 4 పెద్ద గెస్ట్ బెడ్రూమ్ లున్నాయి. ఇక్కడ పిల్లలు కుమార్తె నిషిత, కవల కుమారులు ఆర్యమాన్ , ఆర్యవీర్ కోసం 11వ అంతస్తులో లగ్జరీ బెడ్ రూంలు ఉండేలా ప్లాన్ చేశారు. Rakesh Jhunjhunwala’s Terrace #RJ #Investing pic.twitter.com/PPfWbTVdHB — Rajiv Mehta (@rajivmehta19) May 11, 2023 తన కోసం పెద్ద బెడ్రూం స్టాక్ మార్కెట్ లెజెండ్ ఝున్ఝన్వాలాతన భార్య రేఖతో కలిసి 12వ అంతస్తులో విశాలమైన గదులు, విలాసవంతమైన సౌకర్యాలతో మాస్టర్ బెడ్రూమ్ తయారు చేయించుకున్నారు. ఇది సగటు 2BHK కంటే 20 శాతం పెద్దది. అలాగే బాత్రూమ్ ముంబైలో విక్రయించే సగటు 1 BHK అంత పెద్దది. ఇక భోజనాల గది 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్ కంటే పెద్దది. అంతేకాదు చిన్నప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అమెరికా బడా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్లను తన ఇంట్లో విందుకు ఆహ్వానించాలనే కోరిక ఉండేదిట. వీటితోపాటు, తన కలల ప్రాజెక్టు పూర్తి కాగానే ఆయన కన్నుమూయడం విషాదం. -
హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త
ఇప్పటి జనరేషన్‌కి ఆమె గురించి పెద్దగా తెలియదు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా సరే అతిలోక సుందరి శ్రీదేవి ఫెర్ఫెక్ట్గా ఉండేది. తెలుగులో రెండు మూడు జనరేషన్ స్టార్ హీరోలతో నటించిన ఆమె.. 2018లో అనుకోని విధంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఓ కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ డ్రీమ్ ని ఆమె భర్త బోనీ కపూర్ తీర్చారు. ఏంటా కోరిక? 80ల్లో హీరోయిన్గా మంచి ఊపు మీదున్నప్పుడు శ్రీదేవి.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది. అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది. చాలా ఆశపడింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది. దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) ఇన్నాళ్లకు అలా శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్.. ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్తో అందమైన భవనం కట్టించారు. 'ఇది శ్రీదేవి కల. అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేశాం. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ని పూర్తి చేశాం. చాలా ఆనందంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పారు. తల్లిలా కూతురు అయితే అమ్మ శ్రీదేవి అడుగుజాడల్లోనే కూతురు జాన్వీ కపూర్ వెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో జాన్వీనే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం జాన్వీకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. In the late 80's during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai. Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 Boney Kapoor is happy to fulfilling Sri Devi's dream. He says, "Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house."@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
టైటానిక్ ఇల్లు కట్టుకున్న రైతు
-
గౌరీ ఖాన్ పనికి షారూఖ్ మేనేజర్ పూజా ఫిదా! ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..!
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్‌గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్‌ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్‌పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు? షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్‌ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) బాలీవుడ్ టాప్ హీరో షారూక్‌కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది. -
పని మనిషి కాస్త.. ఓనర్ అయ్యింది!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్ పమేలా కీ లిండెన్ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది. ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి. -
35 రోజుల్లో అదిరిపోయే డ్రీమ్ హౌస్
-
మూడేళ్ల కష్టం, బాలీవుడ్ నటుడి డ్రీమ్ హౌస్ చూశారా?
వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖి. తాజాగా అతడు ముంబైలో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. దీనికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా మారడం విశేషం. గ్రామంలో తన బాల్యాన్ని గడిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడట నవాజుద్దీన్. తండ్రి నవాబుద్దిన్ సిద్ధిఖి గుర్తుగా ఈ భవంతికి నవాబ్ అని నామకరణం చేశాడు. తన కలల సౌధాన్ని కళ్ల ముందు నెలకొల్పడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. ఈ మధ్యే ఈ డ్రీమ్ హౌస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడీయన. 'మంచి నటుడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఎందుకంటే లోపలున్న మనిషి ఎప్పుడూ మంచి పనులను చేయమని పురమాయిస్తుంటాడు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఆ మధ్య బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిత్ర పరిశ్రమలో నెపోటిజం కంటే కూడా ఎక్కువగా రేసిజం(జాత్యంహకారం) సమస్య ఉందని పేర్కొన్నాడు. పరిశ్రమలో పక్షపాతాలు పోవాలని, ఇప్పటికే దానివల్ల ఎంతోమంది గొప్ప నటులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) -
ట్రెండింగ్‌లో హిమజ డ్రీమ్ హౌస్, నాలుగంతస్తుల్లో థియేటర్ కూడా!
'ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు' అని ఊరికే అనలేదు పెద్దలు. ఈ రెండింటిలో ఏది మొదలుపెట్టినా అనుకున్నదానికన్నా ఎక్కువే ఖర్చవుతుంది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఎంతోమంది తారలు ఇల్లు కట్టుకుని సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ కూడా గతంలోనే ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. కాకపోతే తన తల్లి సహకారంతో దాన్ని సొంతం చేసుకున్నానని, ఎప్పటికైనా తన సొంత డబ్బులతో ఒక డ్రీమ్ హౌస్‌ను కట్టుకుంటానని చెప్పింది. అన్నట్లుగానే ఇన్నాళ్లకు ఆ కలను నెరవేర్చుకుంటోంది కూడా! తాజాగా నిర్మాణంలో ఉన్న తన డ్రీమ్ హౌస్‌ను వీడియో తీసి అభిమానులతో పంచుకుంది హిమజ. నాలుగంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నానని, ఇందులో మోడ్రన్ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నానని వెల్లడించింది. ఆ మధ్య భూమి పూజ చేపట్టిన దృశ్యాలను సైతం చూపించింది. ఆ సమయంలో ఇంటి కోసం పారపట్టి మత్తి ఎట్టింది హిమజ. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న కూలీలకు భోజనం కూడా వడ్డించింది. చదవండి: Mansi Srivastava Wedding: గ్రాండ్‌గా నటి పెళ్లి, ఫొటోలు వైరల్ తన పేరెంట్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే బెడ్రూమ్ ఏర్పాటు చేశానంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తనదేనన్న ఆమె ప్రత్యేకంగా మేకప్ రూమ్ కూడా నిర్మిస్తున్నానని చెప్పింది. దానిపై ఫ్లోర్లో జిమ్, ఆపై దాంట్లో థియేటర్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నానంది. నాలుగంతస్తులు కట్టడానికి, అందులో ఇంటీరియర్ డిజైన్‌కు మొత్తంగా ఒక ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
కొత్తింట్లోకి సీరియల్ నటి, గృహప్రవేశానికి లక్ష రూపాయల చీర
TV Actress Naveena House Warming: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లలో నటించింది నవీన. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన ధారావాహికల ద్వారా బాగానే సంపాదించింది. పైసా పైసా పెట్టి కూడబెట్టిన డబ్బుతో కొత్తింటి కల సాకారం చేసుకుంది. తాజాగా తన కలల ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె గృహప్రవేశం పేరిట ఓ వీడియోను సొంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ గృహప్రవేశం కోసం మొట్టమొదటి సారిగా లక్ష రూపాయలు పెట్టి కొన్న చీరను కట్టుకుని తెగ మురిసిపోయింది. జీవితంలో ఒక్కసారైనా లక్ష రూపాయల చీర కట్టుకోవాలనుకున్నానని, అది ఎట్టకేలకు నెరవేరిందని చెప్పుకొచ్చింది. అలాగే తను కొన్న బంగారు ఆభరణాలు.. కడియాలు, షార్ట్ అండ్ లాంగ్ నెక్లెస్‌లు సైతం చూపించింది. గృహపూజ అనంతరం ఇల్లు కట్టిన మేస్త్రీ దంపతులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించింది. అనంతరం నవీన సంతానమైన ఇద్దరు కొడుకులకు ధోతీ ఫంక్షన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ గృహప్రవేశం వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. -
డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..!
డ్రీమ్ హౌస్‌ను కూల్చేసే పరిస్థితొస్తే మీరైతే ఏం చేస్తారు? గుండె రాయి చేసుకుని వేరే ఇంటికి మారిపోతారు. కానీ ఈ జంట మాత్రం ఆరునూరైనా సరే తమ ఇళ్లు కూల్చడానికి వీల్లేదనుకున్నారు. పడవలపై సముద్రం దాటించిమరీ వేరే చోటుకి తమ కలల ఇల్లుని షిఫ్ట్ చేసుకున్నారు. దీనికి సంబంధించని వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లండన్‌లోని న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన డానియేలి పెన్నీ రెండు అంతస్థుల ఇంటిని ద్వీపకల్పంలో కట్టుకుంది. చుట్లూ అందమైన పర్వతాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో యజమాని ఇంటిని కూల్చివేస్తున్నాడనే పెనువార్త తెలిసింది. దీంతో పెన్నీ, ఆమె భర్త కిర్క్ లోవెల్ ఒక పథకం ప్రకారం ఇంటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటిని ఒక మెటల్ ఫ్రేమ్‌పై అమర్చారు. తర్వాత టైర్లు కట్టి, రెండు చిన్న పడవల సహాయంతో సముద్రం దాటించి గమ్యస్థానానికి తీసుకెళ్లారు. ఇది అంత సులువుగా జరగలేదట. సముద్రం దాటించేటప్పుడు మధ్యలో ఒక పడవ విరిగిపోవడంతో ఇళ్లు నీళ్లలో మునగడం ప్రారంభించింది. ఇళ్లు ఇక దక్కదని ఆశలు వదులుకున్నారు. ఎట్టకేలకు ఇంటిని ఒక ముక్కగా అమర్చి 8 గంటల్లో వేరో చోటికి మార్చగలిగామని అక్కడి స్థానిక మీడియాకు తెలియజేశారు. ఇంటిపై మమకారం వారిని ఇంత సాహసానికి పురిగొల్పింది.! చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే! -
ఆ ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటా!
పరిణీతి చోప్రాకి ఎప్పట్నుంచో ఓ కల ఉంది. ఉదయం నిద్రలేవగానే సముద్రాన్ని చూడాలన్నదే ఆ కల. ఆ కల నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? సముద్రం కనిపించేలా ఇల్లు కట్టుకోవాలి. పరిణీతి అదే పనిలో ఉన్నారు. ఈ విషయం గురించి ఆమె చెబుతూ -‘‘ఉదయాన్నే కళ్లు తెరవగానే సముద్రాన్ని చూడాలి. ఆ సాగరఘోష అనునిత్యం నా జీవితంలో భాగం అయిపోవాలి. సముద్రానికి ఆటుపోట్లు ఎలాగో, మన జీవితంలో కష్టసుఖాలు కూడా అలానే. నా అభిరుచికి తగ్గట్టుగా నా కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నాను’’ అన్నారు. ముంబయ్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో ఈ డ్రీమ్ హౌస్‌ని నిర్మించుకుంటున్నారామె. ఈ ఇంటి గురించి వివరంగా చెబుతూ - ‘‘పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. మొత్తానికి నా పేరుతో బాంద్రాలో ఇల్లు కట్టుకుంటున్నా. ఇదంతా ఓ కలలా ఉంది. చిన్నతనం నుంచి నేను పుస్తకాల పురుగుని. అందుకే నా ఇల్లు ఏకంగా వెయ్యి పుస్తకాలతో నిండిపోవాలని నా ఆశ. పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నా. విషయం ఏంటంటే... ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఉండబోతున్నా. అందుకే, ఏ టైల్స్ వేయాలి? ఏ రంగులైతే బాగుంటాయి? లాంటివన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నా’’ అని పరిణీతి తెలిపారు.