TV Actress Naveena Dream House Warming Ceremony Video Goes ViralTV Actress Naveena Dream House Warming Ceremony Video Goes Viral - Sakshi
Sakshi News home page

Serial Actress: సీరియల్‌ నటి కొత్తింటి కల సాకారం, గృహప్రవేశానికి రూ.లక్ష చీర

Published Fri, Dec 31 2021 12:41 PM | Last Updated on Fri, Dec 31 2021 1:46 PM

TV Actress Naveena Dream House Warming Ceremony Video Goes Viral - Sakshi

TV Actress Naveena House Warming: బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియళ్లలో నటించింది నవీన. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నవీన ధారావాహికల ద్వారా బాగానే సంపాదించింది. పైసా పైసా పెట్టి కూడబెట్టిన డబ్బుతో కొత్తింటి కల సాకారం చేసుకుంది. తాజాగా తన కలల ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె గృహప్రవేశం పేరిట ఓ వీడియోను సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. అంతేకాదు, ఈ గృహప్రవేశం కోసం మొట్టమొదటి సారిగా లక్ష రూపాయలు పెట్టి కొన్న చీరను కట్టుకుని తెగ మురిసిపోయింది.

జీవితంలో ఒక్కసారైనా లక్ష రూపాయల చీర కట్టుకోవాలనుకున్నానని, అది ఎట్టకేలకు నెరవేరిందని చెప్పుకొచ్చింది. అలాగే తను కొన్న బంగారు ఆభరణాలు.. కడియాలు, షార్ట్‌ అండ్‌ లాంగ్‌ నెక్లెస్‌లు సైతం చూపించింది. గృహపూజ అనంతరం ఇల్లు కట్టిన మేస్త్రీ దంపతులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించింది. అనంతరం నవీన సంతానమైన ఇద్దరు కొడుకులకు ధోతీ ఫంక్షన్‌ కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ గృహప్రవేశం వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement