
బుల్లితెర నటి నవీన ఇటీవలే తన కలల ఇంట్లోకి గృహప్రవేశం చేసి వార్తల్లో నిలిచింది. ఈ వేడుకకు ఆమె లక్ష రూపాయల చీర కట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్న నవీన తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భర్తకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి కార్ల షోరూంకు వెళ్లిన నటి అక్కడున్న కార్లన్నింటిపై ఓ లుక్కేసింది.
ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బీఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సన్ రూఫ్ ఉన్న కారు లేదని, దీనికి మాత్రం పైన ఓపెన్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఇక షోరూమ్‌లోనే కేక్ కట్ చేసి పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకుని సంతోషపడిపోయింది. అనంతరం కారుకు పూజ చేయించి నెక్లెస్ రోడ్‌లో మరోసారి కేక్ కట్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment