వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖి. తాజాగా అతడు ముంబైలో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. దీనికి అతడే ఇంటీరియర్ డిజైనర్‌గా మారడం విశేషం. గ్రామంలో తన బాల్యాన్ని గడిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడట నవాజుద్దీన్. తండ్రి నవాబుద్దిన్ సిద్ధిఖి గుర్తుగా ఈ భవంతికి నవాబ్ అని నామకరణం చేశాడు. తన కలల సౌధాన్ని కళ్ల ముందు నెలకొల్పడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. ఈ మధ్యే ఈ డ్రీమ్ హౌస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడీయన. 'మంచి నటుడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. ఎందుకంటే లోపలున్న మనిషి ఎప్పుడూ మంచి పనులను చేయమని పురమాయిస్తుంటాడు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.
కాగా నవాజుద్దీన్ సిద్ధిఖి ఆ మధ్య బాలీవుడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిత్ర పరిశ్రమలో నెపోటిజం కంటే కూడా ఎక్కువగా రేసిజం(జాత్యంహకారం) సమస్య ఉందని పేర్కొన్నాడు. పరిశ్రమలో పక్షపాతాలు పోవాలని, ఇప్పటికే దానివల్ల ఎంతోమంది గొప్ప నటులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు సినిమాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment