సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్‌గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్‌ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్‌పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు?
షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది.
పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్‌ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ టాప్ హీరో షారూక్‌కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment