interial decoration
-
గౌరీ ఖాన్ పనికి షారూఖ్ మేనేజర్ పూజా ఫిదా! ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..!
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్‌గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్‌ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్‌పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు? షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్‌ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) బాలీవుడ్ టాప్ హీరో షారూక్‌కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది. -
Home Creations: పండగవేళ కాపర్ కాంతులు.. పాత వస్తువులతో ఇంటి అలంకరణ!
పాతకాలం నాటి ఇత్తడి, ఇనుము, కలప వస్తువులతో గృహాలకంరణ చేయడం అనేది మనకు తెలిసిందే. పూర్తి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ స్టైల్ ఇంటి అందాన్ని ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంది. అయితే, మంచినీటిని నిల్వచేసుకుని తాగే రాగిపాత్రలు ఇప్పుడు ఇంటి కళలో వినూత్నంగా మెరిసిపోతున్నాయి. దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్ముతాయి. సంప్రదాయ జిలుగులే కాదు ఆధునికపు హంగులుగానూ ‘రాగి’ తన వైభవాన్ని చాటుతోంది. ఫ్లవర్వేజ్గానూ, హ్యాంగింగ్ బెల్స్గానూ, క్యాండిల్ స్టాండ్‌గానూ, పూలకుండీలుగా, పార్టిషన్ వాల్స్గానూ రాగి తన దర్జాను చూపుతోంది. పండగ జిలుగులు పండగల వేళ సంప్రదాయ కళ ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు బ్రాస్ లేదా కాపర్ ఎంపిక తప్పనిసరి. ఒక చిన్న మార్పు పండగ కళను ఇంట రెట్టింపు చేస్తుంది. దీపాల పండగకు అలంకరణలో సంప్రదాయ కళ ఎప్పుడూ తన వైభవాన్ని చాటుతుంది. ఇందుకు నాటి రాగి పాత్రలు అలంకరణలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. అలంకరణలో ఎన్ని ఆధునిక వస్తువులున్నా ఒక రాగి పాత్ర హోమ్ క్రియేషన్‌లో భాగం చేస్తే చాలు ఆ లుక్కే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు, రోజువారీ వాడకంలో ఉన్న రాగి ప్లేట్లు, గ్లాసులు, టీ కెటిల్, చిన్న చిన్న రాగి పాత్రలు.. ప్రతీది ఇంటి అలంకరణలో గొప్పగా అమరిపోతుంది. అందుకు నిన్న మొన్నటి తరాలు దాచిన అపురూపమైన రాగి వస్తువులను అలంకరణకు ఎంచుకోవచ్చు. ఆధునిక కాంతి గృహాలంకరణలో కాపర్ కోటింగ్ ఓ అద్భుతాన్ని చూపడానికి ఎంచుకుంటున్నారు ఇటీవల ఇంటీరియర్ డిజైనర్లు. రాగితో డిజైన్ చేసిన టేబుల్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్‌లు ఆధునికంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేలు, ఇండోర్ ప్లాంట్ పాట్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. స్టాండ్లు, షెల్వ్స్, వాల్పేపర్లు, పార్టిషన్గానూ కాపర్ కొత్తగా మెరిసిపోతోంది. పాత్రలకే పరిమితం కాకుండా ఫ్రేమ్స్ రూపంలోనూ మోడర్న్ ఆర్ట్‌గా వినూత్నమైన అందాన్ని చూపుతోంది. ఖరీదులోనూ ఘనమైనదిగా కాపర్ ఇంటికి వింటేజ్ కళతో పాటు గ్రాండ్‌నెస్‌ను మోసుకువస్తుంది. కళాభిమానులు అనే కితాబులనూ అలంకరణ చేసినవారికి అందిస్తుంది. చూపులను కట్టిపడేసే రాగికి దీపకాంతులు జత చేరితే ఇక ఆ ఇంట దివ్యకాంతులు విరబూస్తాయి. -
నయా లుక్
ఆకట్టుకుంటున్న ఫర్నీచర్ అందరికీ అందుబాటు ధరల్లో.. నగరంలో వెలుస్తున్న దుకాణాలు కరీంనగర్ కల్చరల్ : ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. స్వర్గాన్ని తలదన్నేలా ఇంటిని తయారుచేసుకుంటున్నారు నగరవాసులు. ఇంటికి తగ్గ ఫర్నీచర్‌ను అమర్చినప్పుడే దాని అందం రెట్టింపవుతుంది. ఇందుకనుగుణంగానే నగరవాసులు వారికి నచ్చిన ఫర్నీచర్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహా షోరూమ్‌లు కరీంనగర్లోనూ వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫర్నీచర్ లభిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తూ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నారు. వెరైటీగా ఉండే సోఫాసెట్, డైనింగ్ టేబుళ్లు, వాటికి అనుగుణంగా విభిన్న రకాల టీపాయ్‌లు, ఇంటిని మరింత అందంగా మార్చే కప్‌బోర్డులు, డ్రెస్సింగ్ టేబుళ్లను ఇంట్లో అమర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన, అందమైన డిజైన్లలో ఫర్నీచర్ కావాలంటే ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వలసి వచ్చేది. కానీ ఇప్పుడు అంతశ్రమ తీసుకోనవసరం లేదు. గృహోపకరణాలతోపాటు కార్యాలయాలకు సరిపడా అన్ని రకాల ఫర్నీచర్ కరీంనగర్‌లోనే లభిస్తుంది. దుకాణాలు శ్రీ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–సాయినగర్ పవన్ ఫర్నీచర్ సెంటర్–వాల్మీకినగర్ తెలంగాణ ఫర్నీచర్ సెంటర్–సవరన్‌స్ట్రీట్ లైఫ్‌సై్టల్ ఫర్నీచర్ సెంటర్– డైలీ మార్కెట్ హిందూస్థాన్ ఫర్నీచర్ సెంటర్– అస్లమ్ మజీద్ దగ్గర ఆకార్ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర ఏపీ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర స్టార్ ఫర్నీచర్ సెంటర్–డాక్టర్స్ స్ట్రీట్ ఆశా ఫర్నీచర్ సెంటర్–ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర మధుర ఫర్నీచర్ సెంటర్–టవర్ సర్కిల్ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–ఆఫీస్రోడ్ ధరలు(రూ.లలో) డైనింగ్ సెట్స్ 10వేల–35వేల వరకు సోఫాసెట్లు 11వేల–65వేల వరకు ఆఫీస్ ఫర్నీచర్ 15వేల–50వేల వరకు డబుల్ కాట్బెడ్ 5వేల–35వేల వరకు స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ 5వేల–35 వేల వరకు ఇంటి అందాన్ని పెంచుతాయి ఇల్లు ఎంత ఆధునికతతో నిర్మించినప్పటికి అందుకుతగ్గట్లు ఫర్నీచర్ కూడా ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి మరింత అందం వస్తుంది. గతంలో వెరైటీ ఫర్నీచర్ కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని రకాల ఫర్నీచర్ ఇక్కడే లభిస్తుంది. – రతన్‌కుమార్, ప్రభుత్వ ఉద్యోగి వెరైటీలు లభిస్తున్నాయి ఆధునితకు తోడు ఆకర్షణీయ డిజైన్లలో ఫర్నీచర్ లభిస్తుంది. ఇల్లు ఎంత అందంగా కట్టుకున్న అందుకు అనుగుణంగా ఫర్నీచర్ లేకపోతే వృథానే. ఖర్చుతో నిమిత్తంలేకుండా ఇంటి నిర్మాణనికి అనుగుణంగా అవసరమైన ఫర్నీచర్ ఉండాల్సిందే. – డాక్టర్ ఎల్.శేషశైలజ, జనరల్ ఫిజీషియన్ నాణ్యత, మన్నికే ముఖ్యం సంపన్నులతోపాటు మధ్య తరగతివర్గాల వారికి అనువైన రీతిలో ఫర్నీచర్‌తోపాటు అదే తరహా ధరలతో అందించడం మా ప్రత్యేకత. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లతో కూడిన ఫర్నీచర్ అందుబాటులో ఉంటుంది. – శివ బాలజీ, ఫర్నీచర్ సెంటర్ నిర్వాహకుడు