-
ఆకట్టుకుంటున్న ఫర్నీచర్
-
అందరికీ అందుబాటు ధరల్లో..
-
నగరంలో వెలుస్తున్న దుకాణాలు
కరీంనగర్ కల్చరల్ : ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. స్వర్గాన్ని తలదన్నేలా ఇంటిని తయారుచేసుకుంటున్నారు నగరవాసులు. ఇంటికి తగ్గ ఫర్నీచర్‌ను అమర్చినప్పుడే దాని అందం రెట్టింపవుతుంది. ఇందుకనుగుణంగానే నగరవాసులు వారికి నచ్చిన ఫర్నీచర్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహా షోరూమ్‌లు కరీంనగర్‌లోనూ వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫర్నీచర్ లభిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తూ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నారు. వెరైటీగా ఉండే సోఫాసెట్, డైనింగ్ టేబుళ్లు, వాటికి అనుగుణంగా విభిన్న రకాల టీపాయ్‌లు, ఇంటిని మరింత అందంగా మార్చే కప్‌బోర్డులు, డ్రెస్సింగ్ టేబుళ్లను ఇంట్లో అమర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన, అందమైన డిజైన్లలో ఫర్నీచర్ కావాలంటే ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వలసి వచ్చేది. కానీ ఇప్పుడు అంతశ్రమ తీసుకోనవసరం లేదు. గృహోపకరణాలతోపాటు కార్యాలయాలకు సరిపడా అన్ని రకాల ఫర్నీచర్ కరీంనగర్‌లోనే లభిస్తుంది.
దుకాణాలు
శ్రీ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–సాయినగర్
పవన్ ఫర్నీచర్ సెంటర్–వాల్మీకినగర్
తెలంగాణ ఫర్నీచర్ సెంటర్–సవరన్‌స్ట్రీట్
లైఫ్‌సై్టల్ ఫర్నీచర్ సెంటర్– డైలీ మార్కెట్
హిందూస్థాన్ ఫర్నీచర్ సెంటర్– అస్లమ్ మజీద్ దగ్గర
ఆకార్ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర
ఏపీ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర
స్టార్ ఫర్నీచర్ సెంటర్–డాక్టర్స్ స్ట్రీట్
ఆశా ఫర్నీచర్ సెంటర్–ఎస్‌బీహెచ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర
మధుర ఫర్నీచర్ సెంటర్–టవర్ సర్కిల్
బాలాజీ ఫర్నీచర్ సెంటర్–ఆఫీస్‌రోడ్
ధరలు(రూ.లలో)
డైనింగ్ సెట్స్ 10వేల–35వేల వరకు
సోఫాసెట్లు 11వేల–65వేల వరకు
ఆఫీస్ ఫర్నీచర్ 15వేల–50వేల వరకు
డబుల్ కాట్‌బెడ్ 5వేల–35వేల వరకు
స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ 5వేల–35 వేల వరకు
ఇంటి అందాన్ని పెంచుతాయి
ఇల్లు ఎంత ఆధునికతతో నిర్మించినప్పటికి అందుకుతగ్గట్లు ఫర్నీచర్ కూడా ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి మరింత అందం వస్తుంది. గతంలో వెరైటీ ఫర్నీచర్ కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని రకాల ఫర్నీచర్ ఇక్కడే లభిస్తుంది.
– రతన్‌కుమార్, ప్రభుత్వ ఉద్యోగి
వెరైటీలు లభిస్తున్నాయి
ఆధునితకు తోడు ఆకర్షణీయ డిజైన్లలో ఫర్నీచర్ లభిస్తుంది. ఇల్లు ఎంత అందంగా కట్టుకున్న అందుకు అనుగుణంగా ఫర్నీచర్ లేకపోతే వృథానే. ఖర్చుతో నిమిత్తంలేకుండా ఇంటి నిర్మాణనికి అనుగుణంగా అవసరమైన ఫర్నీచర్ ఉండాల్సిందే.
– డాక్టర్ ఎల్.శేషశైలజ, జనరల్ ఫిజీషియన్
నాణ్యత, మన్నికే ముఖ్యం
సంపన్నులతోపాటు మధ్య తరగతివర్గాల వారికి అనువైన రీతిలో ఫర్నీచర్‌తోపాటు అదే తరహా ధరలతో అందించడం మా ప్రత్యేకత. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లతో కూడిన ఫర్నీచర్ అందుబాటులో ఉంటుంది.
– శివ బాలజీ, ఫర్నీచర్ సెంటర్ నిర్వాహకుడు