
బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గుడ్‌న్యూస్ చెప్పింది.

తన సొంతింటి కల త్వరలోనే సాకారం కాబోతున్నట్లు వెల్లడించింది. కొత్తింటి నిర్మాణ పనులు మొదలైనట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఈ మేరకు కొత్తగా కడుతున్న ఇంటి ముందు చెల్లెలు నయని ముగ్గుతో కలిసున్న ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇది చూసిన ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు.











