Bigg Boss Himaja Shares Her Dream House Construction Video - Sakshi
Sakshi News home page

Himaja Dream House: నాలుగంతస్తుల ఇల్లు కడుతున్న హిమజ, థియేటర్‌ కూడా!

Published Mon, Jan 24 2022 3:07 PM | Last Updated on Fri, Jan 28 2022 11:49 AM

Bigg Boss Himaja Shares Her Dream House Construction Video - Sakshi

'ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు' అని ఊరికే అనలేదు పెద్దలు. ఈ రెండింటిలో ఏది మొదలుపెట్టినా అనుకున్నదానికన్నా ఎక్కువే ఖర్చవుతుంది. అయినా సరే తగ్గేదే లే అంటూ ఎంతోమంది తారలు ఇల్లు కట్టుకుని సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ కూడా గతంలోనే ఓ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. కాకపోతే తన తల్లి సహకారంతో దాన్ని సొంతం చేసుకున్నానని, ఎప్పటికైనా తన సొంత డబ్బులతో ఒక డ్రీమ్‌ హౌస్‌ను కట్టుకుంటానని చెప్పింది.

అన్నట్లుగానే ఇన్నాళ్లకు ఆ కలను నెరవేర్చుకుంటోంది కూడా! తాజాగా నిర్మాణంలో ఉన్న తన డ్రీమ్‌ హౌస్‌ను వీడియో తీసి అభిమానులతో పంచుకుంది హిమజ. నాలుగంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నానని, ఇందులో మోడ్రన్‌ లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నానని వెల్లడించింది. ఆ మధ్య భూమి పూజ చేపట్టిన దృశ్యాలను సైతం చూపించింది. ఆ సమయంలో ఇంటి కోసం పారపట్టి మత్తి ఎట్టింది హిమజ. అంతేకాకుండా అక్కడ పని చేస్తున్న కూలీలకు భోజనం కూడా వడ్డించింది.

చదవండి: Mansi Srivastava Wedding: గ్రాండ్‌గా నటి పెళ్లి, ఫొటోలు వైరల్‌

తన పేరెంట్స్‌ కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే బెడ్‌రూమ్‌ ఏర్పాటు చేశానంది. ఫస్ట్‌ ఫ్లోర్‌ మొత్తం తనదేనన్న ఆమె ప్రత్యేకంగా మేకప్‌ రూమ్‌ కూడా నిర్మిస్తున్నానని చెప్పింది. దానిపై ఫ్లోర్‌లో జిమ్‌, ఆపై దాంట్లో థియేటర్‌ ఉండేలా ఏర్పాటు చేస్తున్నానంది. నాలుగంతస్తులు కట్టడానికి, అందులో ఇంటీరియర్‌ డిజైన్‌కు మొత్తంగా ఒక ఏడాది పడుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement