
మణిరత్నంకి పోటీ వస్తున్న సీనియర్ హీరో
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలా ఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. చిత్రయూనిట్, సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. డేట్ మాత్రం ప్రకటించలేదు.
తాజాగా గురు మూవీ రిలీజ్ డేట్పై చిత్రయూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఏప్రిల్ 7న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అదే రోజు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తుండటంతో తెలుగు నాట భారీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్.. గురు, కార్తీ.. చెలియాల మధ్య గట్టి పోటి నెలకొంది. మరి వెంకీ ఇంత పోటిలో బరిలో దిగుతాడా లేక మరో డేట్ కోసం ఎదురుచూస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.