cheliya
-
‘అదేంటోగానీ.... గుప్పెడు గుండె తిప్పలు పెట్టే.. చెలియా’
సందీప్ అశ్వ, పూజారెడ్డి జంటగా, ఇన్నోస్పైర్ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ‘చెలియా’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది. ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, మనోజ్ కుమార్ చేవూరి ఆలపించడంతో పాటు సంగీతం అందించారు. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. ‘అదేంటోగానీ. గుప్పెడు గుండె తిప్పలు పెట్టే..నీ మైకంలో దిగిపోయా.. చెలియా.. ఏం చేశావో మాయా.. చెలియా.. నీ నవ్వుకూ బానిసనయ్యా.... అంటూ సందర్భానుసారంగా `చెలియా..` అంటూ హై పిచ్‌లో పాడే పాట శ్రోతల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. పాటకు అనుగుణంగా వాటర్‌ఫాల్స్, మధ్య మధ్యలో ఇద్దరి డైలాగ్‌లు, చూపులతో ప్రేమను వ్యక్తీకరించడం వంటివి యూత్‌ను అలరిస్తాయి. అడుగడుగునా ఆనందాలే.. అన్నట్లుగా సినిమాటోగ్రాఫర్ దర్శకుడు అయిన మణి కుమార్ గూడూరు అంతే చక్కగా కెమెరాలో బంధించారు. -
‘నవాబ్’ షూటింగ్ పూర్తి చేసిన శింబు
ఇటీవల కాలం ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం నవాబ్ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేశారు శింబు. శింబు షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని, అనుకున్న సమయానికి సినిమా పూర్తికాదన్న అపవాదు ఉంది. అయితే అలాంటి రూమర్స్‌కు చెక్ పెడుతూ శింబు కూడా తన పోర్షన్ అనుకున్న సమయానికే పూర్తి చేశారు. ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. -
మణిరత్నం దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా ఓ మల్టీ స్టారర్ సినిమాను మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ జ్యోతిక తాను త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాచియార్ షూటింగ్ లో బిజీగా ఉన్న జ్యోతిక తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించకపోయినా.. మణిరత్నం పర్మిషన్ తాను ఆ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలిపానన్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్యోతిక ఈ విషయాలను వెల్లడించారు. పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న జ్యోతిక 2015లో 36 వయదినిలే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ కు రెడీ అయిన మగలిర్ మట్టుం సినిమాలో డాక్యుమెంటరీ ఫిలింమేకర్ గానటించిన జ్యోతిక, నాచియార్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. -
'చెలియా' మూవీ రివ్యూ
టైటిల్ : చెలియా జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : కార్తీ, అదితి రావ్ హైదరీ, రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్ సంగీతం : ఏ ఆర్ రెహమాన్ నిర్మాత, దర్శకత్వం : మణిరత్నం చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చెలియా. మణి మార్క్ విజువల్స్ తో టేకింగ్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెలియా మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? మణిరత్నం ఫాం కంటిన్యూ చేశాడా..? మాస్ హీరోగా ఇమేజ్ ఉన్న కార్తీ మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..? కథ : చెలియా కథ 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో జరుగుతుంది. ఓ యుద్ధవిమాన ప్రమాదంలో గాయపడిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వరుణ్ అలియాస్ వీసీ(కార్తీ) పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుతాడు. రావల్పిండిలోని జైల్లో వరుణ్ ను చిత్రహింసలకు గురిచేస్తారు. అలా చీకటి గదిలో బందిగా ఉండగా వరుణ్ కి గతం గుర్తుకు వస్తుంది. వరుణ్, శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఫైటర్ పైలెట్. తన సుపీరియర్ ఆఫీసర్ కూతురు గిరిజ( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో ఉంటాడు. ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన వరుణ్ కు యాక్సిడెంట్ అవుతుంది. మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లేంత సమయం లేకపోవటంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డ్యూటి డాక్టర్ లేకపోవటంతో అప్పుడే డ్యూటిలో చేరిన లీలా అబ్రహం(అదితి రావ్ హైదరీ) వరుణ్ ని ట్రీట్ చేస్తుంది. తొలి చూపులోనే లీలాతో ప్రేమలో పడిన వరుణ్, గిరిజ వాళ్ల పేరెంట్స్ కు నో చెప్పేస్తాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి లీలా వెంట పడటం స్టార్ట్ చేస్తాడు. లీలా అన్న వరుణ్ బ్యాచ్ మెట్ కావటంతో వరుణ్ గురించి ముందే తెలుసుకున్న లీలా వరుణ్ కి దగ్గరవుతుంది. అయితే తన మాటే గెలవాలన్న నెగ్గలన్నట్టుగా ఉండే వరుణ్, తన ఇండివిడ్యూవాలిటీ తనకు ఉండాలనుకునే లీలాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల మధ్యే లీలా గర్భవతి అని తెలుస్తుంది. వరుణ్ పెళ్ళికి నో చెప్పటంతో లీలా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వటంతో లీలాను వెయిట్ చేయమని చెప్పి వరుణ్ వెళ్లిపోతాడు. అలా వెళ్లిన వరుణ్ ఫైటర్ ప్లేన్ ప్రమాదం కారణంగా కూలిపోతుంది. వరుణ్ పాక్ ఆర్మీకి బంధీ అవుతాడు. పాక్ జైల్ ఉన్న వరుణ్ ఎలా బయటపడ్డాడు.? తిరిగి లీలాను కలుసుకున్నాడా..? లీలా వరుణ్ ను ఎలా రిసీవ్ చేసుకుంది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కార్తీ తొలిసారిగా మణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ తో పూర్తి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలో కనిపించాడు. మణి, కార్తీ మీద పెట్టుకున్న నమ్మకానికి వంద శాతం న్యాయం చేశాడు. ఆర్మీ ఆఫీసర్ లో ఉండే ఆవేశం, అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి కోసం పడే తపన ఇలా రెండు భావాలను గొప్పగా పలికించాడు. హీరోయిన్ గా నటించిన అదితి రావ్ హైదరీ తన అందంతోనే సగం మార్కులు కొట్టేసింది. నటిగానూ కార్తీకి గట్టిపోటినిచ్చింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్ తమ పరిది మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : ప్రతీ ఫ్రేమ్ లోనూ ఇది మణిరత్నం సినిమా అని తెలిసేలా తెరకెక్కించే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం, చెలియాతోనే అదే చేశారు. గ్రాండ్ విజువల్స్, మనసు తాకే ఎమోషన్స్, క్యూట్ రొమాన్స్, దేశభక్తి ఇలా మణి మార్క్ సినిమా అంతా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్తీని ఫైటర్ పైలట్ గా చూపించిన మణిరత్నం దేశభక్తికి సంబంధించిన సన్నివేశాలపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పాక్ ఆర్మీ చేతుల్లో ఉన్న ఓ భారత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈజీగా తప్పించుకొని తిరిగి భారత వచ్చేయటం అంత నమ్మశక్యంగా అనిపించదు. అదే సమయంలో మణి మార్క్ స్లో నారేషన్ కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే ఎస్ రవివర్మన్ సినిమాటోగ్రఫి అన్ని మరిచిపోయేలా చేస్తుంది. కాశ్మీర్ అందాలను తెర మీద అద్భుతంగా చూపించారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజ్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది. రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం మరోసారి మ్యాజిక్ చేశాడు. మణి టేకింగ్ కు రెహమాన్ సంగీతం తోడై మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కార్తీ నటన అదితిరావ్ హైదరీ అందం సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ రొటీన్ స్క్రీన్ ప్లే చెలియా.. మణి మార్క్ రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడే వారికోసం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
టార్చర్ కాదు... ఛాలెంజ్!
‘‘మణిరత్నంగారితో చిత్రమంటే టార్చర్ కాదు... నటీనటులకు ఓ ఛాలెంజ్. మాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ, ఆయన రాసే క్లిష్టమైన కథల్లో నటించడం అంత సులభం కాదు. అయినా... లైఫ్‌లో ఛాలెంజ్ లేకపోతే కిక్ ఏముంటుంది? ఈ సినిమాతో మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే మా కల నిజమైంది’’ అన్నారు కార్తీ, అదితీరావ్ హైదరీలు. వీళ్లిద్దరూ జంటగా మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తమిళ చిత్రం ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ నెల 7న వస్తోన్న ఈ సినిమా గురించి కార్తీ, అదితీలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ మేం చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఓ ఫైటర్ పైలట్, ఓ డాక్టర్ మధ్య జరిగే ప్రేమకథే ఈ ‘చెలియా’. చిత్రమంతా వీళ్లిద్దరి (మా) పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్‌గా చాలా డెప్త్ ఉన్న పాత్రల్లో నటించాం. చిత్రీకరణకు ముందు నాలుగైదు నెలలు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్‌లో పాల్గొనడం వల్ల, మణిరత్నం సలహాలు పాటించడంవల్ల ఈజీగా నటించేశాం. కానీ, కాశ్మీర్లో 4 నుంచి మైనస్ 14 డిగ్రీల టెంపరేచర్ మధ్య షూటింగ్ చేయడానికి కష్టపడ్డాం. ఏఆర్ రెహమాన్ మంచి బాణీలను, సిరివెన్నెలగారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మణిరత్నం 'చెలియా'
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన సినిమా చెలియా. మణి మార్క్ టేకింగ్‌తో విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మణిరత్నం తన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కార్తీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తుండగా అదిథి రావు హీరోగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ కాగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు!
హీరో కార్తీ ‘‘ఏ స్కూల్లో నేను సినిమా గురించి నేర్చుకున్నానో ఆ స్కూల్లో మళ్లీ యాక్టింగ్ నేర్చుకున్నా. అన్నయ్య (సూర్య) లేదా లియోనార్డో డికాప్రియో చేయాల్సిన పాత్ర. నాకెందుకు సార్? అనడిగా. కానీ, మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు. హీరోగా ఓ పదేళ్ల తర్వాత నాకు క్యారెక్టర్ మీద కొంచెం కమాండ్ వచ్చినట్టుంది’’ అన్నారు కార్తీ. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితీరావ్ హైదరి జంటగా నటించిన తమిళ సినిమా ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో సీడీలను చిత్రపాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి విడుదల చేశారు. కార్తీ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారు ఎంతో పరిశోధన చేసి, ఈ కథ రాశారు. నేనూ ఫ్లయింగ్ క్లాసులకు వెళ్లాను. ఇందులో ఫైటర్ పైలట్‌గా నటించా. 200 కోట్ల మెషీన్, 72 పారామీటర్స్... ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ను కంట్రోల్ చేయడం ఎంతో కష్టం. పైలట్ షార్ప్‌గా ఉండాలి. ఈ పాత్రకు కనీసం పది శాతం న్యాయం చేసినా.. నేను గొప్ప ఘనత సాధించినట్టే. ఇది వార్ ఫిల్మ్ కాదు... ప్రేమకథే’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి రెహమాన్, సీతారామశాస్త్రిగారు స్ట్రాంగ్ పిల్లర్స్. ఈ మ్యూజిక్ ఇంత స్పెషల్‌గా ఉందంటే వీళ్లే కారణం’’ అన్నారు మణిరత్నం. ‘‘తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించినప్పుడల్లా ఇక్కడి పాటలే నచ్చుతాయి. బహుశా.. తెలుగు భాష గొప్పదనం అనుకుంటా’’ అన్నారు ఏఆర్ రెహమాన్. సుహాసిని మాట్లాడుతూ – ‘‘మణిరత్నాన్ని ‘మీకు కథ, డైలాగులు రాయడం.. షాట్ పెట్టడం వచ్చా?’ అని అడుగుతాను. నేను ఆయన్ను ప్రశంసించడం కష్టం. కానీ, ప్రేక్షకులు ప్రశంసిస్తారు. ఆయన మళ్లీ మళ్లీ ప్రేమకథలే ఎందుకు తీస్తారో తెలీదు. దానికి కారణం మాత్రం నేను కాదు. ఆయనెప్పుడూ హీరోకి ఈజీ క్యారెక్టర్ ఇవ్వరు. ఎన్ని హింసలున్నాయో అన్నీ పెడతారు. అవన్నీ దాటుకుని నటించాలి. ఈ సినిమాలో కార్తీ, అదితీలు ఆయన్ను డామినేట్ చేశారు’’ అన్నారు. అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను హెదరాబాదీ అమ్మాయినే. చిన్నప్పుడు ‘బొంబాయి’లో ‘కెహనాహై క్యా..’ పాట చూసేదాన్ని. అలాంటి పాటలో నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు. ఇటీవల ‘దిల్’ రాజు సతీమణి అనితారెడ్డి మరణించడంతో ఆయన ఈ వేడుకకు రాలేదు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ‘దిల్’ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వంశీ పైడిపల్లి, కార్తీ, అదితీరావ్ హైదరి, సుహాసిని, మణిరత్నం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఎ.ఆర్. రెహమాన్, కిరణ్ -
థ్రిల్లింగ్ సీన్స్‌తో చెలియా ట్రైలర్ 2
-
థ్రిల్లింగ్ సీన్స్‌తో చెలియా ట్రైలర్ 2
మణిరత్నం దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ చెలియా. కార్తీ సరనన అథితి రావ్ హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం, చెలియాతో ఆ ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా మణిరత్నం సినిమాలో అభిమానులు ఏ ఏ అంశాలను ఆశిస్తాడో.. ఆ అంశాలన్నింటితో చెలియాను రూపొందించాడు. ఇప్పటి వరకు ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా మాత్రమే ప్రొమోట్ చేసిన మణిరత్నం తాజాగా రిలీజ్ చేసిన రెండో ట్రైలర్‌తో ట్విస్ట్ ఇచ్చాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో పాటు కొండ అంచుల్లో జీపు నడపడం.. హీరో శత్రువుల చేతుల్లో చిక్కుకొని చిత్రహింసలు గురికావటం. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం.. ఇలా రోజా సినిమా మరోసారి గుర్తు చేశాడు. తొలి ట్రైలర్‌తో ఏర్పడ్డ అంచనాలు ఈ తాజా ట్రైలర్‌తో రెట్టింపు అయ్యాయి. -
రొమాంటిక్ మూవీలో మాస్ లుక్ కూడా..!
తమిళ నటుడు కార్తీకి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ కామెడీని పండించటంలో కార్తీకి తిరుగులేదు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ కార్తీని నీట్ షేవ్‌లో క్లాస్‌గా చూపిస్తూ వచ్చారు. ముందు నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో రోజా తరహా దేశభక్తి కూడా ఉందని తెలుస్తోంది. ఈ సీన్స్‌లో కార్తీ పూర్తి మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇటీవల విడుదలైన స్టిల్స్‌లో కార్తీ తీవ్రవాదిలా కనిపిస్తున్న లుక్స్ సినిమా మీద అంచనాలను డబుల్ చేస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
చెలియ... చెలియా..!
మణిరత్నం అంటే ఓ బ్రాండ్! లవ్... రొమాన్స్... సాంగ్స్... మణిరత్నం సినిమాలంటే ఇవేకాదు. ‘రోజా’, ‘దిల్ సే’ సినిమాల్లో టెర్రరిజమ్, ‘బొంబాయి’లో మత ఘర్షణలు వంటి సున్నితమైన అంశాలను తెరపై హృద్యంగా ఆవిష్కరించారు. మళ్లీ అలాంటి సున్నితమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు అనిపిస్తోంది. తమిళ హీరో కార్తీ, బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘కాట్రు వెళియిడై’. తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్ కమ్ పైలట్, హీరోయిన్ డాక్టర్. యుద్ధం నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీస్తున్నారట మణిరత్నం. ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరకర్త. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. త్వరలో మిగతా పాటలు విడుదల కానున్నాయి. ఈలోపు మణిరత్నం షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
మణిరత్నంకి పోటీ వస్తున్న సీనియర్ హీరో
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గురు. తమిళ హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలా ఖద్దూస్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. చిత్రయూనిట్, సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజాగా గురు మూవీ రిలీజ్ డేట్‌పై చిత్రయూనిట్ ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఏప్రిల్ 7న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే అదే రోజు గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటిస్తుండటంతో తెలుగు నాట భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వెంకటేష్.. గురు, కార్తీ.. చెలియాల మధ్య గట్టి పోటి నెలకొంది. మరి వెంకీ ఇంత పోటిలో బరిలో దిగుతాడా లేక మరో డేట్ కోసం ఎదురుచూస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మణిరత్నం మూవీ లేటెస్ట్ అప్డేట్
ఓకె జాను సినిమాతో ఫాంలోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ఆడియన్స్‌ను అలరించనున్నాడు. కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ హీరోగా తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం కాట్రు వెలియడై. అతిథి రావు హైదరీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమా తెలుగు వర్షన్‌కు డ్యూయెట్ అనే టైటిల్‌ను నిర్ణయించినా ఇటీవల చెలియా అని మార్చారు. ఈ విషయాన్ని తెలుగు వర్షన్ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేయాలని భావించినా.. పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత సమయం కేటాయించాలన్న ఆలోచనతో రిలీజ్‌ను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.