చెలియ... చెలియా..! | etting a taste of ARR, Mani Ratnam and 'Kaatru Veliyidai' | Sakshi
Sakshi News home page

చెలియ... చెలియా..!

Published Sat, Mar 11 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

చెలియ... చెలియా..!

చెలియ... చెలియా..!

మణిరత్నం అంటే ఓ బ్రాండ్‌! లవ్‌... రొమాన్స్‌... సాంగ్స్‌... మణిరత్నం సినిమాలంటే ఇవేకాదు. ‘రోజా’, ‘దిల్‌ సే’ సినిమాల్లో టెర్రరిజమ్, ‘బొంబాయి’లో మత ఘర్షణలు వంటి సున్నితమైన అంశాలను తెరపై హృద్యంగా ఆవిష్కరించారు. మళ్లీ అలాంటి సున్నితమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు అనిపిస్తోంది. తమిళ హీరో కార్తీ, బాలీవుడ్‌ భామ అదితీరావు హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘కాట్రు వెళియిడై’.

తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఇందులో హీరో ఆర్మీ ఆఫీసర్‌ కమ్‌ పైలట్, హీరోయిన్‌ డాక్టర్‌. యుద్ధం నేపథ్యంలో లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నారట మణిరత్నం. ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరకర్త. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. త్వరలో మిగతా పాటలు విడుదల కానున్నాయి. ఈలోపు మణిరత్నం షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement