టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌! | Maniratnam Karthi Cheliya film release on 07th april | Sakshi
Sakshi News home page

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

Published Tue, Apr 4 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

టార్చర్‌ కాదు... ఛాలెంజ్‌!

‘‘మణిరత్నంగారితో చిత్రమంటే టార్చర్‌ కాదు... నటీనటులకు ఓ ఛాలెంజ్‌. మాకు ఆయన ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. కానీ, ఆయన రాసే క్లిష్టమైన కథల్లో నటించడం అంత సులభం కాదు. అయినా... లైఫ్‌లో ఛాలెంజ్‌ లేకపోతే కిక్‌ ఏముంటుంది? ఈ సినిమాతో మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే మా కల నిజమైంది’’ అన్నారు కార్తీ, అదితీరావ్‌ హైదరీలు.

 వీళ్లిద్దరూ జంటగా మణిరత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తమిళ చిత్రం ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఈ నెల 7న వస్తోన్న ఈ సినిమా గురించి కార్తీ, అదితీలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ మేం చేసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఓ ఫైటర్‌ పైలట్, ఓ డాక్టర్‌ మధ్య జరిగే ప్రేమకథే ఈ ‘చెలియా’. చిత్రమంతా వీళ్లిద్దరి (మా) పాత్రల చుట్టూ తిరుగుతుంది.

 ఎమోషనల్‌గా చాలా డెప్త్‌ ఉన్న పాత్రల్లో నటించాం. చిత్రీకరణకు ముందు నాలుగైదు నెలలు స్క్రిప్ట్‌ రీడింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడం వల్ల, మణిరత్నం సలహాలు పాటించడంవల్ల ఈజీగా నటించేశాం. కానీ, కాశ్మీర్‌లో 4 నుంచి మైనస్‌ 14 డిగ్రీల టెంపరేచర్‌ మధ్య షూటింగ్‌ చేయడానికి కష్టపడ్డాం. ఏఆర్‌ రెహమాన్‌ మంచి బాణీలను, సిరివెన్నెలగారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement