రొమాంటిక్ మూవీలో మాస్ లుక్ కూడా..! | Karthi Mass look in Mani rathnam Cheliya | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ మూవీలో మాస్ లుక్ కూడా..!

Published Tue, Mar 21 2017 11:19 AM | Last Updated on Tue, Oct 9 2018 5:00 PM

రొమాంటిక్ మూవీలో మాస్ లుక్ కూడా..! - Sakshi

రొమాంటిక్ మూవీలో మాస్ లుక్ కూడా..!

తమిళ నటుడు కార్తీకి కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మాస్ కామెడీని పండించటంలో కార్తీకి తిరుగులేదు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెలియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ కార్తీని నీట్ షేవ్లో క్లాస్గా చూపిస్తూ వచ్చారు. ముందు నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో రోజా తరహా దేశభక్తి కూడా ఉందని తెలుస్తోంది. ఈ సీన్స్లో కార్తీ పూర్తి మాస్ లుక్లో దర్శనమివ్వనున్నాడు. ఇటీవల విడుదలైన స్టిల్స్లో కార్తీ తీవ్రవాదిలా కనిపిస్తున్న లుక్స్ సినిమా మీద అంచనాలను డబుల్ చేస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement