
మణిరత్నం దర్శకత్వంలో సీనియర్ హీరోయిన్
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన లెజెండరీ దర్శకుడు మణిరత్నం తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా ఓ మల్టీ స్టారర్ సినిమాను మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ జ్యోతిక తాను త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్టుగా ప్రకటించారు.
ప్రస్తుతం బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాచియార్ షూటింగ్ లో బిజీగా ఉన్న జ్యోతిక తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశారు. అయితే సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించకపోయినా.. మణిరత్నం పర్మిషన్ తాను ఆ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలిపానన్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న మగలిర్ మట్టుం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్యోతిక ఈ విషయాలను వెల్లడించారు.
పెళ్లి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న జ్యోతిక 2015లో 36 వయదినిలే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ కు రెడీ అయిన మగలిర్ మట్టుం సినిమాలో డాక్యుమెంటరీ ఫిలింమేకర్ గానటించిన జ్యోతిక, నాచియార్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.