
జ్యోతిక పర్ఫెక్ట్ ప్లాన్‌తో దూసుకెళుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఆమె నటించిన ‘నవాబ్’ ఈ నెల 27న విడుదల కానుంది. వాస్తవానికి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఒక రోజు ముందే వస్తున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ ఆనంది, నిర్మాతల్లో ఒకరైన సుభాష్ కరణ్ తెలిపారు. అరవింద్ స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందింది.
మరోవైపు రాధామోహన్ డైరెక్షన్‌లో జ్యోతిక చేస్తున్న ‘కాట్రిన్ మొళి’ వచ్చే నెల 18న రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ఇక జ్యోతిక ఖాళీ అన్న మాట అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు ఎస్. రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జ్యోతిక లీడ్ రోల్‌లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో మొదలు కానుంది. ఇదే సంస్థ సూర్య హీరోగా ‘ఎన్‌జీకే’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం ‘36 వయదినిలే’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుసగా లీడ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉండటం విశేషం. పెళ్లయిన తారలకు అవకాశాలు తగ్గుతాయనే మాట నిజం కాదని జ్యోతికలాంటి వాళ్లు నిరూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment