ఒక సైనికుడికి స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. చాలామందిని అడిగాడు. దానికి వారు ఇచ్చిన సమాధానాలు అతడికి తృప్తి కలిగించలేదు. చివరగా సుదూర నగరంలోని ఒక గురువును ఆశ్రయించాడు. గురువుకు వినయంగా నమస్కరించి– ‘గురువర్యా! ఈ స్వర్గనరకాలు అంటారే, అవేమిటి?’ అని వినయంగా ప్రశ్నించాడు. ‘నీ ముఖానికి నీక్కూడా స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా?’ కఠినంగా ప్రశ్నించాడు గురువు. సైనికుడు ఆ ప్రశ్నను ఊహించలేదు.
అతడి ముఖంలో రంగులు మారినై. కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన ఒరలోని కత్తిని బయటికి తీశాడు. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు. ‘అయితే ఆ కత్తితో నా తలను ఖండిద్దామనే అనుకుంటున్నావా? నా మెడను నరికేంత పదును దానికి ఉందా?’ అన్నాడు ఆత్మవిశ్వాసంగా గురువు. గురువు మాటల్లోని ఆంతర్యం గ్రహించిన సైనికుడు సిగ్గుపడి కత్తిని తీసి మళ్లీ ఒరలో పెట్టుకున్నాడు. ‘ఇప్పుడు చూడు, స్వర్గ ద్వారం నిన్ను ఆహ్వానిస్తోంది’ అన్నాడు చిర్నవ్వుతో గురువు. సైనికుడి ప్రయాణం సఫలమైంది. తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న ప్రశ్నకు సరైన జవాబు దొరికింది.,కోపమే నరకం. శాంతియే స్వర్గం. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment