మరో సీనియర్ హీరోతో క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే వరకు ఎక్కువగా యువ కథానాయకులతోనే సినిమాలు తెరకెక్కించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ స్టార్ బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత మరో సీనియర్ హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్. ప్రస్తుతం గురు సినిమాతో పాటు, నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు.
ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.