gautami putra satakarni
-
శాతకర్ణి తమిళ ఆడియో లాంచ్
గౌతమీ పుత్ర శాతకర్ణి తమిళ ఆడియో ఆవిష్కరణ వేడుకలు సోమవారం చెన్నైలో జరగనున్నాయి. దీనికి మౌంట్‌రోడ్‌లో గల కలైవానర్ అరంగం వేదిక కానుంది. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రను తమిళ ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఆర్ఎన్సీ సినిమా నిర్మాత నరేంద్ర దీన్ని తమిళంలోకి డబ్ చేశారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో ఆడియో వేడుకలను ఈనెల10వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెన్నై టీటీడీ స్థానిక సలహామండలి సభ్యులు దాశిని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌతమీపుత్ర శాతకర్ణి చక్రవర్తి సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలు సోమవారం జరగనున్న తరుణంలో ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్లు తెలిపారు.అలాగే శాతకర్ణి సినిమా దర్శకులు క్రిష్, నటి శ్రియా, నటుడు ప్రభు, యువ హీరోలు కార్తిక్, జయం రవి , విశాల్, కలైపులి థాను, ఇంకా పలువురు తమిళ సినీ ప్రముఖుల హాజరవుతారని ఆయన తెలిపారు. -
తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించి చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగు నాట రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు తమిళ నాట డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రిష్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని గొప్ప చారిత్రాత్మక కథను దర్శకుడు క్రిష్ వెండితెరపై అద్భుతంగా మలిచిన తీరుకు తమిళ ప్రజలు కూడా కాసులు వర్షం కురిపిస్తారని భావిస్తున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని బాలకృష్ణకు తల్లిగా కీలక పాత్రను పోషించడం విశేషం. చారిత్రక కథా చిత్రాలు అరుదైపోతున్న ఈ రోజుల్లో చరిత్రను తవ్వి,తానికి కల్పిత హంగులు అద్ది గొప్ప కళాఖండంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆర్ఎన్సీ.సినిమా పతాకంపై నిర్మాత నరేంద్ర గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నై, సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నటీమణులు వెన్నెరాడై నిర్మల,లత,దర్శకుడు కేఎస్.రవికుమార్, జాగ్వర్‌తంగం తదితరులు అతిధులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ తనకు చెన్నైతో మంచి అనుబంధం ఉందన్నారు. తన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తమిళనాడులో విడుదల కానండటం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కథానాయకుడిగా చేయడమే మంచి అనుభూతిగా పేర్కొన్నారు.ప్రస్తుతం తాను హిందిలో ఝాన్సీరాణి కథతో మణికర్ణిక అనే చారిత్రక చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపారు. -
క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..?
గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ మరో రెండు చారిత్రక చిత్రాలకు దృశ్యరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో అఖండ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి కథను గుర్తుచేశాడు. ఈ సినిమా విజయానందంలో ఉన్న క్రిష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. గౌతమబుద్ధుడు, శ్రీకృష్ణదేవరాయల జీవిత కథలను సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించాడు క్రిష్. వీటిలో గౌతమబుద్ధుడు సినిమాను రెండు మూడు సన్నివేశాల ఆధారంగా ఆఫ్ బీట్ సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక శ్రీకృష్ణదేవరాయలు సినిమాను మాత్రం పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఆదిత్య 369 లాంటి చిత్రాల్లో శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ లో కనిపించిన బాలయ్యతోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడు క్రిష్. -
శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు: కేబినెట్
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పలు అంశాలపై చర్చకు మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంజిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్టీ సంస్థకు రూ. 95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలవాలని నిర్ణయించారు. ఇక గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు.. అది తన వియ్యంకుడికి సంబంధించిన విషయం కావడంతో ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. -
రియాలిటీ చెక్
-
అభిమానిపై శాతకర్ణి ఆగ్రహం
వందో చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాలకృష్ణ అభిమానులు మంచి సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లకు స్వయంగా బాలకృష్ణ కూడా వెళ్లడంతో ఇక అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఎలాగైనా బాలయ్య బాబును దగ్గర నుంచి చూడాలని, ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని పలువురు యువకులు ఉత్సాహపడుతున్నారు. కానీ.. సరిగ్గా ఇలాగే సరదా పడిన ఓ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఓ థియేటర్ నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణతో సెల్ఫీ తీసుకోడానికి ఓ కుర్రాడు ప్రయత్నించగా, ఆయన మాత్రం కోపంగా అతడి చేతిని విసిరికొట్టారు. దాంతో అతడి ఫోన్ కింద పడిపోయింది. ఆ తర్వాత కూడా బాలకృష్ణ అతడిని ఆగ్రహంతో తిడుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతోంది. -
150+100= మూవీ బిగ్గెస్ట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేవి రెండే రెండు. ఒకటి కోడి పందాల సంబరాలు, రెండోది విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ సినిమా ప్రాజెక్టులు. కాగా, ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ మూవీ శతమానం భవతి నిలిచాయి. అయితే ఇందులో రెండు మూవీలకు ఓ ప్రత్యేకత ఉంది. చిరు లెటెస్ట్ మూవీ ఆయనకు 150వ చిత్రం, బాలయ్యకు శాతకర్ణి మూవీ 100వ చిత్రం కావడంతో వారి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల్లోనూ ఈ ఫీవర్ కనిపిస్తోంది. యంగ్ హీరో రామ్ ఈ రెండు మూవీలపై ట్వీట్ చేశారు. 'దిస్ ఈజ్ నో మ్యాథమేటిక్స్.. దిస్ ఈజ్ హిస్టరీ! 150+100= ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చిరు, బాలయ్య మూవీలు కేవలం నంబర్లు మాత్రమే కాదు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మూవీలు తెలుగు ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచనున్నాయని పేర్కొన్నాడు. కాగా నేడు ఖైదీ నెంబర్ 150 విడుదల నేపథ్యంలో ఈ మూవీలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలవాలని ఎనర్జిటిక్ హీరో రామ్ ఆకాంక్షించాడు. #KhaidiNo150 #GPSK ట్యాగ్స్‌తో ట్వీట్ చేశాడు. సంక్రాంతి బరిలో ఉన్న మూవీలు అన్ని బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టాలని మరో యంగ్ హీరో నితిన్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. This is no Mathematics.. This is History! 150 + 100 = The biggest festival ever!Wishing for the biggest blockbusters!! #KhaidiNo150 #GPSK — Ram Pothineni (@ramsayz) 11 January 2017 -
వాళ్ల సినిమాలకు క్షణాల్లో పన్ను మాఫీ... మరి మాకు..?
ఉమ్మడి రాష్ట్రంలోనన్నా మంత్రులు తెలంగాణ వాళ్ళ ఆవేదనను వినేవాళ్ళు. ఒక సందర్భంలో మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి డి.కే అరుణను కలసి ‘తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆమోదం కోసం దరఖాస్తు పెడితే అప్ప టికప్పుడే పచ్చ సిరాతో సంతకం పెట్టి కమిషనర్‌కి ఫార్వర్డ్ చేసిన తీరు గుర్తుకు వస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆగిన ఆ ఫైలు ఇప్పటిదాకా అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. సీఎంతో సహా ఇతర మంత్రులు కూడా తెలంగాణ వాళ్ళు తీసిన సినిమాలకంటే సీమాంధ్ర నిర్మా తల సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మోజు పడి భారీ బడ్జెట్ సినిమాల వేడు కలకు హాజరు అవుతున్నారు. మరో వైపున తెలంగాణ నిర్మాతలకు సీఎం అపాయింట్మెంటే దొరకదు! అదే ‘రుద్రమదేవి’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలకు అప్పటికప్పుడే క్షణాలలో పన్ను మాఫీ చేయమని హుకుం జారీ అయిపోయింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సిని మాలే. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? ఒక చరిత్ర గాంచిన గొప్ప పేరు పెట్టి సినిమా తీస్తే సరిపోతుందా? వక్రీకరణలు, అసభ్య దృశ్యాలు, అస హజ సన్నివేశాలు, ఎబ్బెట్టు డైలాగులు ఉన్నాయా అని చూడకుండానే జీఓలు పాస్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నచ్చిన వారికి నచ్చిన విధంగా, నచ్చ నివారిని దగ్గరకు రానీయకుండా చేయ డం సబబేనా! వేరుపడ్డాక కూడా తెలం గాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా? ఎన్నో తక్కువ బడ్జెట్ సినిమాలు , తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు, తెలంగాణ చరి త్రను, పోరాటాలను తెరకెక్కించిన సినిమాలు అతికష్టంతో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు థియేటర్లు దొర కక, ఒకవేళ అరకొర థియేటర్లు దొరి కినా, భారీ అద్దెలు పన్నులు కట్టలేక, నిలబడలేక చితికిపోయిన సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటికి పన్నుమాఫీ చేసి ఆదుకుంటే, అది నిజమైన ప్రోత్సా హకం అనబడేది. మేము ప్రొసీజర్ ప్రకా రంగా దాఖలుచేసినా మా ఫైల్ అంగుళం కూడా జరగదు, అదే కొందరికి అప్పటి కప్పుడే ఉత్తర్వులు జారీ అయిపోతు న్నాయి. ఎదిగే దశలో ఉన్నవారిపట్ల మెడలు తిప్పుకొని, ఇప్పటికే ఎదిగిపోయిన వారితో మితిమీరిన అలాయ్ బలాయ్ తీసుకుని, వేదికలు పంచుకుంటున్నారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌కి తెలంగాణ చిత్రపరిశ్రమ సమస్యలు దఫదఫాలుగా విడమర్చి చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్షణాలలో పన్ను మినహా యింపు కొరకు జీవో జారీ చేసినట్లుగా, తెలంగాణ భూమిపుత్రుల కోసం ఒక ప్రత్యేక సినిమా పాలసీని రూపొందించ మని కోరుకుంటున్నాం! - సయ్యద్ రఫీ, సినీదర్శకుడు, తెలంగాణ చిత్ర పరిశ్రమ -
ఆ మూవీలు బాక్సాఫీసును షేక్ చేయాలి: హీరో
ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంక్రాంతి ఫీవర్ పట్టుకుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఏ మూవీలు సక్సెస్ సాధిస్తాయి... ఏ మూవీ ఫ్లాఫ్ అవుతుందని కొన్ని రోజుల ముందు నుంచే టాక్ మొదలవుతుంది. సంక్రాంతికి విడుదలకానున్న మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి భారీ సక్సెస్ సాధించాలని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అకాంక్షించాడు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి, యువహీరో శర్వానంద్ నటించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'శతమానం భవతి' సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్న ఈ మూడు చిత్రాలు ఈ నూతన సంవత్సరంలో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో అద్భుత విజయాన్ని సాధించాలని నితిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు రెండు భారీ మూవీలు విడుదలైనా శతమానం భవతిని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని.. స్టోరీ తమకు ప్లాస్ పాయింట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. I wish n hope that al d 3 sankranti releases perform extremely well and start this new year with a bang at the boxoffice..#khaidi #gpsk #Sb — nithiin (@actor_nithiin) 7 January 2017 -
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
-
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. కేసీఆర్ ను కలిసిందేకు బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమా తిలకించేందుకు రావాల్సిందిగా కేసీఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానించారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. హీరోయిన్ గా శ్రియ, కీలక పాత్రలో హేమమాలిని నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంలో అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. -
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. క్రిష్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి- జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ హీరోయిన్గా నటించగా, వీరమాత గౌతమిగా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటి హేమమాలిని నటించారు. ఈ సినిమాలకు సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సెర్టిఫికెట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు క్రిష్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. -
బాబాయ్ తరువాత అబ్బాయితో..!
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన తరువాతి ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలెట్టేశాడు. ఇప్పటికే నెక్ట్స్ సినిమా కోసం ఓ లైన్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాను ఓ స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ లైన్ ను సిద్ధం చేసిన క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ తరువాత ఎన్టీఆర్‌కు కథ వినిపించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే బాబీ సినిమా పనులు మొదలు పెట్టిన జూనియర్, ఆ తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత 2018లో క్రిష్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది. -
మరో సీనియర్ హీరోతో క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే వరకు ఎక్కువగా యువ కథానాయకులతోనే సినిమాలు తెరకెక్కించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ స్టార్ బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మరో సీనియర్ హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్. ప్రస్తుతం గురు సినిమాతో పాటు, నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
కత్తి దూసిన బాలయ్య
ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పండుగలు కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ప్రతీ పండుగకు ఓ లుక్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తూ సినిమా మీద కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. స్టార్ హీరోలయితే ఈ పోస్టర్ రిలీజ్ లలోనూ పోటి పడుతున్నారు. తమ హీరో లుక్ సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అయ్యింది. టీజర్ కు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 పోస్టర్స్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బాలకృష్ణ కూడా తన వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి లుక్ ను రిలీజ్ చేశాడు. కథన రంగంలో కత్తి దూస్తున్న బాలకృష్ణ శాతకర్ణిగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్
గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అది కూడా బాలకృష్ణ కెరీర్లోనే అత్యథిక మొత్తాలకు రైట్స్ అమ్ముడైనట్టుగా సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దాదాపు 75 కోట్ల వరకు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఆంధ్రకు అత్యధికంగా 30 కోట్లు రాగా సీడెడ్ 9 కోట్లు, నైజాం 11 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి మరో 25 కోట్ల వరకు వచ్చుంటాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బాలయ్య ప్రీ రిలీజ్ లోనే 75 కోట్ల వసూళ్లు సాధించటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.