శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు: కేబినెట్
Published Wed, Jan 25 2017 3:43 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పలు అంశాలపై చర్చకు మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంజిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్‌టీ సంస్థకు రూ. 95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలవాలని నిర్ణయించారు. ఇక గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు.. అది తన వియ్యంకుడికి సంబంధించిన విషయం కావడంతో ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది.
Advertisement
Advertisement