ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం | AP Cabinet Meetong On September 20th | Sakshi
Sakshi News home page

ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం

Published Wed, Sep 13 2023 10:55 AM | Last Updated on Wed, Sep 13 2023 11:55 AM

AP Cabinet Meetong On September 20th - Sakshi

సాక్షి, విజయవాడ: ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది.

కాగా, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
చదవండి: ఆరోగ్యసురక్ష, సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ సమీక్ష

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement