(ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
Published Fri, Jan 6 2017 1:22 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. కేసీఆర్ ను కలిసిందేకు బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమా తిలకించేందుకు రావాల్సిందిగా కేసీఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానించారు.
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. హీరోయిన్ గా శ్రియ, కీలక పాత్రలో హేమమాలిని నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంలో అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
Advertisement