![శాతకర్ణి తమిళ ఆడియో లాంచ్](/styles/webp/s3/article_images/2017/09/5/41476179403_625x300.jpg.webp?itok=Cc22K4Ef)
శాతకర్ణి తమిళ ఆడియో లాంచ్
గౌతమీ పుత్ర శాతకర్ణి తమిళ ఆడియో ఆవిష్కరణ వేడుకలు సోమవారం చెన్నైలో జరగనున్నాయి. దీనికి మౌంట్‌రోడ్‌లో గల కలైవానర్ అరంగం వేదిక కానుంది. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రను తమిళ ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఆర్‌ఎన్సీ సినిమా నిర్మాత నరేంద్ర దీన్ని తమిళంలోకి డబ్ చేశారు. గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో ఆడియో వేడుకలను ఈనెల10వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెన్నై టీటీడీ స్థానిక సలహామండలి సభ్యులు దాశిని చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌతమీపుత్ర శాతకర్ణి చక్రవర్తి సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకలు సోమవారం జరగనున్న తరుణంలో ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్లు తెలిపారు.అలాగే శాతకర్ణి సినిమా దర్శకులు క్రిష్, నటి శ్రియా, నటుడు ప్రభు, యువ హీరోలు కార్తిక్, జయం రవి , విశాల్, కలైపులి థాను, ఇంకా పలువురు తమిళ సినీ ప్రముఖుల హాజరవుతారని ఆయన తెలిపారు.