క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..? | Director Krish readying for another sensation | Sakshi
Sakshi News home page

క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..?

Published Tue, Feb 14 2017 10:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..?

క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..?

గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ మరో రెండు చారిత్రక చిత్రాలకు దృశ్యరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో అఖండ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి కథను గుర్తుచేశాడు. ఈ సినిమా విజయానందంలో ఉన్న క్రిష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. గౌతమబుద్ధుడు, శ్రీకృష్ణదేవరాయల జీవిత కథలను సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించాడు క్రిష్.

వీటిలో గౌతమబుద్ధుడు సినిమాను రెండు మూడు సన్నివేశాల ఆధారంగా ఆఫ్ బీట్ సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక శ్రీకృష్ణదేవరాయలు సినిమాను మాత్రం పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఆదిత్య 369 లాంటి చిత్రాల్లో శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ లో కనిపించిన బాలయ్యతోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను రూపొందించే ప్లాన్లో ఉన్నాడు క్రిష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement