![కత్తి దూసిన బాలయ్య](/styles/webp/s3/article_images/2017/09/4/51477737284_625x300.jpg.webp?itok=frmza5LS)
కత్తి దూసిన బాలయ్య
ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో పండుగలు కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ప్రతీ పండుగకు ఓ లుక్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తూ సినిమా మీద కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. స్టార్ హీరోలయితే ఈ పోస్టర్ రిలీజ్ లలోనూ పోటి పడుతున్నారు. తమ హీరో లుక్ సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అయ్యింది. టీజర్ కు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 పోస్టర్స్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బాలకృష్ణ కూడా తన వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి లుక్ ను రిలీజ్ చేశాడు. కథన రంగంలో కత్తి దూస్తున్న బాలకృష్ణ శాతకర్ణిగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.