
ఇంత కాలం కేవలం సినిమా హీరోలుగానే ఉన్న మన స్టార్స్ ఈ మధ్య కాలంలో టీవీ చానల్ యాంకర్స్‌గా మారిపోయి తమ సత్తా చూపిస్తున్నారు. టెలివిజన్‌లో కూడా తమ అభిమానులను అలరిస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న సినిమా హీరోల వరకు అందరూ ఇప్పుడు హోస్ట్ అవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. పైగా సినిమాలకు ఏ స్థాయి రెమ్యునిరేషన్ తీసుకుంటారో అంతే పారితోషికం తీసుకుని యాంకరింగ్ చేస్తున్నారు.
తెలుగులో ఇప్పటికే చాలా మంది హీరోలు టీవీ చానల్ హోస్టులు అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా నటరత్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో చేరాడు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్‌స్టాపబుల్ NBK అనే టాక్ షోను బాలకృష్ణ చేయబోతున్నారు. అయితే మరి ఈయన కంటే ముందు హోస్టులుగా మారిన హీరోలెవరో ఓ సారి చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్‌కు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు.
కింగ్ నాగార్జున బిగ్ బాస్ (స్టార్ మా), మీలో ఎవరు కోటీశ్వరుడు (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 (స్టార్ మా), ఎవరు మీలో కోటీశ్వరులు (జెమినీ)తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు.
రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారీ (జెమినీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 (స్టార్ మా)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
సాయికుమార్ వావ్, మనం (ఈటీవీ)కు హోస్టుగా అలరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment