![150+100= మూవీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41484105520_625x300.jpg.webp?itok=u-9mPRnh)
150+100= మూవీ బిగ్గెస్ట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేవి రెండే రెండు. ఒకటి కోడి పందాల సంబరాలు, రెండోది విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ సినిమా ప్రాజెక్టులు. కాగా, ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ మూవీ శతమానం భవతి నిలిచాయి. అయితే ఇందులో రెండు మూవీలకు ఓ ప్రత్యేకత ఉంది. చిరు లెటెస్ట్ మూవీ ఆయనకు 150వ చిత్రం, బాలయ్యకు శాతకర్ణి మూవీ 100వ చిత్రం కావడంతో వారి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల్లోనూ ఈ ఫీవర్ కనిపిస్తోంది.
యంగ్ హీరో రామ్ ఈ రెండు మూవీలపై ట్వీట్ చేశారు. 'దిస్ ఈజ్ నో మ్యాథమేటిక్స్.. దిస్ ఈజ్ హిస్టరీ! 150+100= ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చిరు, బాలయ్య మూవీలు కేవలం నంబర్లు మాత్రమే కాదు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మూవీలు తెలుగు ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచనున్నాయని పేర్కొన్నాడు. కాగా నేడు ఖైదీ నెంబర్ 150 విడుదల నేపథ్యంలో ఈ మూవీలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలవాలని ఎనర్జిటిక్ హీరో రామ్ ఆకాంక్షించాడు. #KhaidiNo150 #GPSK ట్యాగ్స్‌తో ట్వీట్ చేశాడు. సంక్రాంతి బరిలో ఉన్న మూవీలు అన్ని బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టాలని మరో యంగ్ హీరో నితిన్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
This is no Mathematics.. This is History! 150 + 100 = The biggest festival ever!Wishing for the biggest blockbusters!! #KhaidiNo150 #GPSK
— Ram Pothineni (@ramsayz) 11 January 2017