
ఆ మూవీలు బాక్సాఫీసును షేక్ చేయాలి: హీరో
ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంక్రాంతి ఫీవర్ పట్టుకుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఏ మూవీలు సక్సెస్ సాధిస్తాయి... ఏ మూవీ ఫ్లాఫ్ అవుతుందని కొన్ని రోజుల ముందు నుంచే టాక్ మొదలవుతుంది. సంక్రాంతికి విడుదలకానున్న మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి భారీ సక్సెస్ సాధించాలని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అకాంక్షించాడు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి, యువహీరో శర్వానంద్ నటించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'శతమానం భవతి' సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి.
ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్న ఈ మూడు చిత్రాలు ఈ నూతన సంవత్సరంలో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో అద్భుత విజయాన్ని సాధించాలని నితిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు రెండు భారీ మూవీలు విడుదలైనా శతమానం భవతిని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని.. స్టోరీ తమకు ప్లాస్ పాయింట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
I wish n hope that al d 3 sankranti releases perform extremely well and start this new year with a bang at the boxoffice..#khaidi #gpsk #Sb
— nithiin (@actor_nithiin) 7 January 2017