Sathamanam Bhavathi
-
శతమానం భవతి
-
‘శతమానం భవతి’ మూవీ స్టిల్స్
-
ఆ మూవీలు బాక్సాఫీసును షేక్ చేయాలి: హీరో
ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంక్రాంతి ఫీవర్ పట్టుకుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఏ మూవీలు సక్సెస్ సాధిస్తాయి... ఏ మూవీ ఫ్లాఫ్ అవుతుందని కొన్ని రోజుల ముందు నుంచే టాక్ మొదలవుతుంది. సంక్రాంతికి విడుదలకానున్న మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి భారీ సక్సెస్ సాధించాలని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అకాంక్షించాడు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి, యువహీరో శర్వానంద్ నటించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'శతమానం భవతి' సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్న ఈ మూడు చిత్రాలు ఈ నూతన సంవత్సరంలో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో అద్భుత విజయాన్ని సాధించాలని నితిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు రెండు భారీ మూవీలు విడుదలైనా శతమానం భవతిని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని.. స్టోరీ తమకు ప్లాస్ పాయింట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. I wish n hope that al d 3 sankranti releases perform extremely well and start this new year with a bang at the boxoffice..#khaidi #gpsk #Sb — nithiin (@actor_nithiin) 7 January 2017 -
వందకోట్లకు గురిపెట్టిన టాలీవుడ్ నిర్మాత!
కొత్త సంవత్సరంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వందకోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ టార్గెట్‌ను అందుకోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా పలు చిన్నా, పెద్ద ప్రాజెక్టులను ఆయన ప్రకటించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన తదుపరి ప్రాజెక్టు చిన్న సినిమా శతమానం భవతి. సంక్రాంతి పండుగ బరిలోకి దూకేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. కాగా, ఆయన చేపట్టిన పెద్ద ప్రాజెక్టు దువ్వాడ జగన్నాథం. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మేలో విడుదల కానుంది. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఫిదా'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక నాచురల్ స్టార్ నానితో దిల్ రాజు నిర్మిస్తున్న 'నేను లోకల్' సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో క్రెజీ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. మణిరత్నం రూపొందించిన 'డ్యుయెట్' సినిమా తెలుగు హక్కులను కూడా ఆయన కొనుగోలు చేశారు. మరికొన్ని ఇతర సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాలుగు సినిమాల ద్వారా నిర్మాతకు రూ. 70 కోట్ల వరకు ఆర్జించే అవకాశముందని, మరో రూ. 30 నుంచి రూ. 40 కోట్ల వరకు ఆర్జించాలని ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'డెక్కన్ క్రానికల్' తెలిపింది. -
పర్ఫెక్ట్ ప్లానింగ్‌లో యంగ్ హీరో
ప్రజెంట్ వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్. గతంలో ఆసక్తికరమైన సినిమాలు చేస్తాడన్న పేరున్న కమర్షియల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవటంలో మాత్రం వెనకపడ్డాడు శర్వా. రన్ రాజా రన్‌తో కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ఈ హీరో ఆ తరువాత విడుదలైన మళ్లీ మళ్లీ ఇదిరానీ రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో తన మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు అదే ఫాంను కంటిన్యూ చేసేందుకు పక్కా ప్లానింగ్‌లో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడు శర్వా. అదే సమయంలో తన 25వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాను మరో స్టార్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో బిగ్ బ్యానర్ యువి క్రియేషన్స్ తోనూ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇలా వరుసగా భారీ బ్యానర్లతో సినిమాలు చేస్తే ప్రమోషన్ పరంగా కూడా కలిసొస్తుందని భావిస్తున్న శర్వానంద్, పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకుపోతున్నాడు. -
తాతామనవళ్ల 'శతమానం భవతి'
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, 'అ..ఆ' ఫేమ్ అనుపమా పరమేశ్వరన్‌లు జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శతమానంభవతి'. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2006లో 'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రీ,కొడుకులను దగ్గర చేశామని, సరిగ్గా పదేళ్ల తర్వాత 2016లో ఈ సినిమాలో తాతా,మనవళ్లను దగ్గర చేయబోతున్నామంటూ ఆ పోస్టర్ ద్వారా సినిమా థీమ్‌ను తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. -
సంక్రాంతి బరిలో.. మళ్లీ ఆ ముగ్గురు
ఇన్నాళ్లు ఒకేసమయంలో రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి సీన్ మారిపోయింది. ఒకేసారి రెండు మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని ప్రూవ్ అయ్యింది. అంతేకాదు సరైన కంటెంట్ ఉంటే అంత కాంపీటీషన్లో కూడా ఓ చిన్న సినిమా సత్తా చాటగలదని నిరూపించాడు శర్వానంద్. నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన, డిక్టేటర్ లాంటి భారీ చిత్రాల రిలీజ్ సమయంలో ఎక్స్‌ప్రెస్ రాజాగా వచ్చి సక్సెస్ సాధించాడు. అందుకే మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి బాలయ్య, నాగార్జునలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. బాలయ్య గౌతమీ పుత్రశాతకర్ణిగా, నాగార్జున ఓం నమో వేంకటేశాయ సినిమాతో పరమ భక్తుడు హాథీరాం బాబాగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మరోసారి ఢీ అనేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి.. మరోసారి సత్తా చాటలని ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. దిల్ రాజుకు కూడా ఈ సీజన్లో మంచి రికార్డ్ ఉండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
మరోసారి ఢీ అంటున్న శర్వా
2016 సంక్రాంతి బరిలో అందరికీ షాక్ ఇచ్చిన యంగ్ హీరో శర్వానంద్. టాప్ స్టార్లు బరిలో ఉన్నా.., తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్, డీసెంట్ హిట్‌తో ఆకట్టుకున్నాడు. సొగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్, నాన్నకు ప్రేమతో లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా వెనకడుగు వేయకుండా థియేటర్లలోకి వచ్చిన శర్వా మంచి కలెక్షన్లతో సత్తా చాటాడు. దీంతో మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం సీనియర్ ప్రొడ్యూసర్ బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో కామెడీ పోలీస్‌గా నటిస్తున్న శర్వానంద్... ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో 2017 సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు బెర్త్ కన్ఫామ్ చేసుకోగా.. మరోసారి ఈ టాప్ స్టార్స్‌తో ఢీకొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. మరి రెండోసారి శర్వానంద్ సాహసం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.