పర్ఫెక్ట్ ప్లానింగ్లో యంగ్ హీరో | Sharwanand Future Plans | Sakshi
Sakshi News home page

పర్ఫెక్ట్ ప్లానింగ్లో యంగ్ హీరో

Published Sun, Nov 27 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

పర్ఫెక్ట్ ప్లానింగ్లో యంగ్ హీరో

పర్ఫెక్ట్ ప్లానింగ్లో యంగ్ హీరో

ప్రజెంట్ వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్. గతంలో ఆసక్తికరమైన సినిమాలు చేస్తాడన్న పేరున్న కమర్షియల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవటంలో మాత్రం వెనకపడ్డాడు శర్వా. రన్ రాజా రన్తో కమర్షియల్ స్టార్గా ప్రూవ్ చేసుకున్న ఈ హీరో ఆ తరువాత విడుదలైన మళ్లీ మళ్లీ ఇదిరానీ రోజు, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు అదే ఫాంను కంటిన్యూ చేసేందుకు పక్కా ప్లానింగ్లో ఉన్నాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం దిల్రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాడు శర్వా. అదే సమయంలో తన 25వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాను మరో స్టార్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరో బిగ్ బ్యానర్ యువి క్రియేషన్స్ తోనూ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇలా వరుసగా భారీ బ్యానర్లతో సినిమాలు చేస్తే ప్రమోషన్ పరంగా కూడా కలిసొస్తుందని భావిస్తున్న శర్వానంద్, పర్ఫెక్ట్ ప్లానింగ్తో దూసుకుపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement