
మరోసారి ఢీ అంటున్న శర్వా
2016 సంక్రాంతి బరిలో అందరికీ షాక్ ఇచ్చిన యంగ్ హీరో శర్వానంద్. టాప్ స్టార్లు బరిలో ఉన్నా.., తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్, డీసెంట్ హిట్తో ఆకట్టుకున్నాడు. సొగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్, నాన్నకు ప్రేమతో లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా వెనకడుగు వేయకుండా థియేటర్లలోకి వచ్చిన శర్వా మంచి కలెక్షన్లతో సత్తా చాటాడు.
దీంతో మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం సీనియర్ ప్రొడ్యూసర్ బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో కామెడీ పోలీస్గా నటిస్తున్న శర్వానంద్... ఆ తరువాత దిల్ రాజు నిర్మాణంలో శతమానం భవతి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో 2017 సంక్రాంతి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు బెర్త్ కన్ఫామ్ చేసుకోగా.. మరోసారి ఈ టాప్ స్టార్స్తో ఢీకొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. మరి రెండోసారి శర్వానంద్ సాహసం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.