తాతామనవళ్ల 'శతమానం భవతి' | 'Sathamanam bhavathi' motion poster released | Sakshi
Sakshi News home page

తాతామనవళ్ల 'శతమానం భవతి'

Published Sun, Aug 14 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

తాతామనవళ్ల 'శతమానం భవతి'

తాతామనవళ్ల 'శతమానం భవతి'

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, 'అ..ఆ' ఫేమ్ అనుపమా పరమేశ్వరన్లు జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శతమానంభవతి'. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2006లో 'బొమ్మరిల్లు' సినిమాలో తండ్రీ,కొడుకులను దగ్గర చేశామని, సరిగ్గా పదేళ్ల తర్వాత 2016లో ఈ సినిమాలో తాతా,మనవళ్లను దగ్గర చేయబోతున్నామంటూ ఆ పోస్టర్ ద్వారా సినిమా థీమ్ను తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలువనుంది. మిక్కీ జె.మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement