Socio Fantasy
-
విశ్వంభర యాక్షన్
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. చిరంజీవి కోటి విరాళం కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ 25లక్షల విరాళంవయనాడ్ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు. -
భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న ‘అంగుళీక’
ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ యాథార్థ సంఘటన ఆధారం చేసుకుని సినిమాకు తగ్గట్టుగా కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో ఫ్యాంటసీ చిత్రమే ‘అంగుళీక’. శ్రీ శంఖు చక్ర ఫిలింస్ పతాకంపై దీపక్, శేఖర్ వర్మ, వివ్యశాన్త్ హీరో హీరోయిన్లుగా నటించారు. కోటి తూముల, ఎ.జగన్మోహన్రెడ్డి నిర్మాతలు. ప్రేమ్ ఆర్యన్ దర్శకుడు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్‌లో చిత్రయూనిట్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి టి.ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్, ముత్యాల రాందాస్, ఏలూరు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..‘అంగుళీక’ ట్రైలర్ బాగుంది. గ్రాఫిక్స్ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. నిర్మాత బడ్జెట్, దర్శకుడి ప్రతిభ ట్రైలర్లో కనిపిస్తోంది. ‘అరుంధతి’లా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలి. ఇక థియేటర్స్ బంద్ అంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందులో నిజం లేదు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దు’అన్నారు. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అంగుళీక' పాటలు, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ నెల 20న వస్తోన్న సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా. ఇక థియేటర్స్ బంద్ అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుతానికి ఎలాంటి బంద్ లేదు. త్వరలో పరిస్థితులు చక్కబడి పబ్లిక్ యథావిధిగా థియేటర్స్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని’ అన్నారు. హీరోయిన్ వివ్య శాంత్ మాట్లాడుతూ..‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు’ అన్నారు. హీరో శేఖర్ వర్మ మాట్లాడుతూ.. ‘ఒక మంచి సినిమాలో నేనూ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ వరకు వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడి శ్రమ ఎంతో ఉంది. మా చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానని’ అన్నారు. చదవండి: నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ.. ‘ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమాను నిర్మించాం. కొన్ని కారణాల వల్ల సినిమా డిలే అయినప్పటికీ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమాపై అందరం ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఈ నెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని’ అన్నారు. నిర్మాణ సారథి రాంబాబు చిక్కవరపు మాట్లాడుతూ.. ‘దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ బాలీవుడ్ చిత్రాలకు గ్రాఫిక్స్ విభాగంలో పని చేసిన అనుభవంతో ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. మనకు ఏడు రకాల సూర్యగ్రహణాలు ఉంటాయి. అందులో ఒక సూర్యగ్రహణం అంగుళీక ఆకారంలో ఉంటుంది. సూర్యభగవానుడి అంశలో పుట్టిన ఒక అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటనేదే సినిమా. కోటి తూముల గట్స్ ఉన్న నిర్మాత. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ నెల 20న విడుదలయ్యే మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని' అన్నారు. చదవండి: సరదా కోసం కాదు.. ఇది మన బాధ్యత దర్శకుడు ప్రేమ్ ఆర్యన్ మాట్లాడుతూ.. ‘సూర్యభగవానుడి అంశలో పుట్టిన అంగుళీక అనే అమ్మాయి కథే ఈ చిత్రం. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ చిన్న సంఘటనను బేస్ చేసుకుని సినిమాగా మలిచాం. ఆరు వందల ఏళ్లకోసారి వచ్చే అంగుళీక సూర్యగ్రహణం ఈ సంవత్సరం 2020లో రానుండటం విశేషం. మా నిర్మాతలు ఇచ్చిన సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని’ అన్నారు. సంగీత దర్శకుడు శ్యామ్ కె.ప్రసన్ మాట్లాడుతూ.. ‘ఇందులో పాటతో పాటు నేపథ్య సంగీతానికి మంచి స్కోపుందని’ అన్నారు. దీపక్, దేవ్‌గిల్, వివ్యశాంత్, శేఖర్‌వర్మ, కోటిశ్వరరావ్, పంకజ్, రామకృష్ణ, జయవాణి, వేణు, రాంజగన్, అవినాష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు, ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేష్, సంగీతం: శ్యామ్ కె ప్రసన్, ఆర్ట్స్: వెంకటేష్, మాటలు : బి.సుదర్శన్, పాటలు : శ్రీమణి, శ్రీనివాస్ పైడిపల్లి, గౌరినందన, సహనిర్మాతలు : శశిబాణా , సిర్రి శివ, పీఆర్వో: రమేష్ చందు, సమర్పణ: మాస్టర్ టి.హర్షిత్‌సాయి, నిర్మాతలు : కోటి తూముల , ఏ.జగన్మోహన్ రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ప్రేమ్ ఆర్యన్ -
ఆ సినిమాలు చెడగొడుతున్నాయి
సహాయ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి, విలన్‌గా, హీరోగా రాణిస్తున్న అజయ్ నటించిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందం శ్రీవాస్తవ్ నిర్మించిన ఈ సినిమాని జూన్ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్‌గా వస్తున్నాయి. టేకింగ్ పరంగా ‘గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్లో వచ్చిన సిక్త్స్ సెన్స్, అన్ బ్రేకబుల్, సైకో’ వంటి సినిమాలను తలపించేలా మా మూవీ ఉంటుంది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం బాధపడుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమాలు యూత్‌ని చెడగొడుతున్నాయి. వీటికి నాంది ‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలే. ఈ సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. దాసరి నారాయణరావుగారి తర్వాత తెలుగు మోడ్రన్ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన రామ్‌గోపాల్ వర్మగారు ‘జీఎస్టీ’ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు కృష్ణవంశీగారు, హీరో చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘క్షణం, గూఢచారి’ సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ‘స్పెషల్’ ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు మా సినిమాని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఇచ్చిన వాస్తవ్గారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని బాపిరాజు అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మణ్యం, కెమెరా: బి. అమర్ కుమార్. -
మరో సీనియర్ హీరోతో క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే వరకు ఎక్కువగా యువ కథానాయకులతోనే సినిమాలు తెరకెక్కించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ స్టార్ బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మరో సీనియర్ హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్. ప్రస్తుతం గురు సినిమాతో పాటు, నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.