ఫ్యాన్స్కు వెంకీ బర్త్డే గిఫ్ట్ | venkatesh guru movie official teaser | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కు వెంకీ బర్త్డే గిఫ్ట్

Published Tue, Dec 13 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

ఫ్యాన్స్కు వెంకీ బర్త్డే గిఫ్ట్

ఫ్యాన్స్కు వెంకీ బర్త్డే గిఫ్ట్

బాబు బంగారం సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం సాలాఖద్దూస్ రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్లో.. వెంకీ డిఫరెంట్ మేకోవర్తో పాటు కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు.

ఈ రోజు( మంగళవారం) వెంకీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోసం ఓ ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమా థీంను, కాన్సెప్ట్ను ఏమాత్రం రివీల్ చేయకుండా కేవలం అభిమానుల కోసమే అన్నట్టుగా టీజర్ను రూపొందించారు. చిన్న మ్యూజిక్ బిట్కు వెంకీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను అలరిస్తున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్తో పాటు ఆడియో రిలీజ్ డేట్లను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement