సాక్షి, భువనేశ్వర్ : సామాజంలో పరివర్తన తీసుకురావండలో గురువుది అద్వితీయమై పాత్రని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో గూగుల్ లేదా మరో సెర్చ్ ఇంజిన్ ఎన్నటికీ గురువుకు పోటీకాలేవని ఆయన స్పష్టం చేశారు. తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువు అనే ఈ నలుగురు వ్యక్తి జీవిత రేఖను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధునిక కాలంలో గూగుల్ ముఖ్యమైనదే.. కానీ గురువును కాదనేంత స్థాయిలో మాత్రం కాదని వెంకయ్యనాయుడు విద్యార్థులకు చెప్పారు.
ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ మాతృభాషను కాపాడుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆవేదన, ప్రేమ, బాధ వంటి భావాలను మాతృభాషలో స్పష్టం చేసినట్లుగా ఇతర భాషల్లో వ్యక్తం చేయలేమని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment