
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
రాజేంద్రనగర్: గూగుల్ అనేది గురువును మించింది కాదని, జ్ఞానాన్ని ప్రసాదించేది గురువేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం గండిపేట మండల పరిధిలోని శ్రీ సరస్వతీ విద్యాపీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా వీధి బడిలో చదివి ఇంత వాడిని అయ్యా నని వెంకయ్యనాయుడు చెప్పారు.
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తాను కూడా శిశుమందిర్ విద్యార్థినేనని గుర్తుచేశారు. అనంతరం సంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు.రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, విద్యాపీఠం నిర్వాహకులు కాశీపతి, లింగం సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, వీరారెడ్డి, నర్సింహారెడ్డితో పాటు వేయి మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment