అలా మజిల్స్‌ పెంచా! | The secret behind Venkatesh' look in guru | Sakshi
Sakshi News home page

అలా మజిల్స్‌ పెంచా!

Published Mon, Dec 12 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

అలా మజిల్స్‌ పెంచా!

అలా మజిల్స్‌ పెంచా!

సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘గురు’ స్టిల్స్‌లో వెంకటేశ్‌ కొత్తగా కనిపించారు. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ సై్టల్‌ మాత్రమేనా... ఐదు పదుల వయసులోనూ కండలు పెంచి అభిమానులను ఫుల్‌ ఖుషీ చేశారు. నేడు వెంకటేశ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీ మజిల్స్‌ సీక్రెట్‌ ఏంటో చెప్పమని ‘సాక్షి’ అడగ్గా... వెంకటేశ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ మేకోవర్‌ నాకు బాగా నచ్చింది. ‘గురు’లో నాది బాక్సింగ్‌ కోచ్‌ పాత్ర. మజిల్స్‌తో బాడీ మరింత ఫిట్‌గా కనిపిస్తే బాగుంటుందనుకున్నా. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కునాల్‌ గిర్‌ దగ్గర కొన్ని నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకున్నా. హై ప్రొటీన్, లో కార్బోస్‌ ఉన్న ఫుడ్‌ తీసుకున్నా. కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినేవాణ్ణి’’ అన్నారు. ఈ ఏడాది ‘బాబు బంగారం’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన... మేనల్లుడు నాగచైతన్య ‘ప్రేమమ్‌’లో అతిథిగా కనిపించారు.

త్వరలో కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నారు. మొత్తం మీద ఈ ఏడాది చాలా సంతోషంగా గడిచిందన్నారు. అన్నట్టు... పుట్టినరోజు సందర్భంగా బయటికొచ్చిన కొత్త స్టిల్స్‌లో వెంకీ హ్యాండ్‌సమ్‌గా ఉన్నారు కదూ. ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’లో లుక్‌లోనే కనిపిస్తారట! ఆ సంగతలా ఉంచితే.. పుట్టినరోజు వేడుక జరుపుకోవడం తనకు అలవాటు లేదన్న వెంకీ.. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన వర్దా తుఫాను బాధితులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement