మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్ | Rogue First lokk Maro Chantigadi premakatha | Sakshi
Sakshi News home page

మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్

Published Tue, Feb 14 2017 1:41 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్ - Sakshi

మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో హీరోయిజానికి అర్ధం మార్చేసిన పూరి, మరోసారి అదే తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందుకే రోగ్ సినిమాకు ఇది మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశాడు. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా ఈ సినిమా పూర్తి చేసిన పూరి, వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టెంపర్ తరువాత వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి కెరీర్ను రోగ్ గాడిలో పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ వారసుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్పై స్పందించిన రామ్గోపాల్ వర్మ 'సూపర్బ్ ఇడియట్ తరువాత గ్రేట్ లుకింగ్ రోగ్, నీకు అలాంటి వాళ్లే ఎందుకు నచ్చుతారు పూరి?' అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement