రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సీవీ ఇషాన్ను హీరోగా పరిచయం చూస్తూ పూరి తెరకెక్కిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే ఇడియట్ సినిమా ట్యాగ్ లైన్ను రిపీట్ చేస్తూ రోగ్కు మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు.
పూరి గత చిత్రాల్లో హీరోల మాదిరి ఇషాన్ కూడా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. టేకింగ్ విషయంలో కూడా పూరి తన పాత స్టైల్నే ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది. బీచ్ సాంగ్స్, డిఫరెంట్ లోకేషన్స్తో టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న రోగ్, పూరితో పాటు ఇషాన్కు కూడా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.