'రోగ్' మూవీ రివ్యూ | ROGUE Movie Review | Sakshi
Sakshi News home page

'రోగ్' మూవీ రివ్యూ

Published Fri, Mar 31 2017 12:24 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

ROGUE Movie Review

టైటిల్ : రోగ్
జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా
తారాగణం : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్ సింగ్ థాకూర్,సుబ్బరాజు
సంగీతం : సునీల్ కశ్యప్
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి



చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఓ బిగ్ సక్సెస్ కోసం రోగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను రోగ్ అందుకుందా..? కొత్తబ్బాయి ఇషాన్, పూరి మార్క్ హీరోయిజంలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..? రోగ్.. పూరి కెరీర్ను గాడిలో పెట్టిందా..?

కథ :
చంటి (ఇషాన్) ప్రేమ కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప ప్రేమికుడు. కమిషనర్ చెల్లెలు అని తెలిసి కూడా అంజలి(ఏంజెలా)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కమిషనర్ తన అండర్లో పనిచేసే ఐపియస్ ఆఫీసర్(సుబ్బరాజు)తో అంజలికి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాడు. విషయం తెలుసుకున్న చంటి కమిషనర్ ఇంటికెళ్లి గొడవ చేస్తాడు. ఆ గొడవలో ఓ కానిస్టేబుల్ను బలంగా కొట్టడంతో అతని రెండు కాళ్లు చచ్చుబడిపోతాయి. ఈ గొడవ చేసినందుకు చంటికి రెండేళ్ల శిక్షపడుతుంది. జైల్లో ఉండగానే తను ప్రేమించిన అంజలి తనని మోసం చేసి సుబ్బరాజును పెళ్లి చేసుకుందని తెలుసుకున్న చంటి, అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడు.

జైలు నుంచి విడుదలైన తరువాత తండ్రి ద్వారా తన చేతుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకుంటాడు చంటి. తన వల్ల నష్టపోయిన వాళ్ల జీవితాలకు ఏదైన దారి చూపించి తాను బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రికవరీ ఏజెంట్గా, ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అయితే చంటి నుంచి సాయం పొందడానికి కానిస్టేబుల్ కుటుంబం అంగీకరించదు. వాళ్లకు ఇష్టం లేకపోయినా వాళ్ల ఇంటి ముందే ఉండి వాళ్ల అప్పులన్ని తీర్చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ చెల్లెలు అంజలి(మన్నారా చోప్రా) అతన్ని ప్రేమిస్తుంది. కానీ తనను మోసం చేసిన అమ్మాయి పేరు కూడా అంజలినే కావటంతో చంటి ముందు కాదన్నా.. తరువాత అంజలికి దగ్గరవుతాడు.



అదే సమయంలో జైలు నుంచి పారిపోయిన ఓ సైకో(అనూప్ థాకూర్ సింగ్), చంటి ఆటో ఎక్కుతాడు. తానను ఓ అమ్మాయి మోసం చేసి జైలుకు పంపిందని చెప్పడంతో చంటి కూడా వాణ్ని పోలీసులకు పట్టించకుండా వదిలేస్తాడు. కానీ ఆ సైకో అంజలి చంపాడినికి ఆమె మీద ఎటాక్ చేస్తాడు. ఈ ఎటాక్ నుంచి తనని కాపాడిన చంటికి, అంజలి మీద పగతోనే సైకో జైలు నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. అసలు ఆ సైకో అంజలిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు..? వాడి నుంచి చంటి, అంజలిని ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
రోగ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఇషాన్, మంచి నటన కనబరిచాడు. లుక్స్ పరంగా పూరి మార్క్ హీరోయిజంలో పర్ఫెక్ట్గా సెట్ అయిన ఇషాన్, మాస్ హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ను తొలి సినిమాలోనే చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్స్గా ఏంజెలా గ్లామర్ షోకే పరిమితం కాగా.. మన్నారా చోప్రా తన పరిథి మేరకు పరవాలేదనిపించింది.  సింగం 3, విన్నర్ సినిమాల్లో స్టైలిష్గా కనిపించిన అనూప్ రోగ్లో సైకోగా మెప్పించాడు. విలనిజంతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తులసి తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
కొంత కాలంగా రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న పూరి జగన్నాథ్, మరోసారి రోగ్ విషయంలోనూ అదే స్టైల్ను ఫాలో అయ్యాడు. రూడ్ హీరో క్యారెక్టర్, గ్లామర్ షోకే పరిమితమైన హీరోయిన్స్, బీచ్ సాంగ్స్, కామెడీ పండించే విలన్, అలీ కామెడీ ట్రాక్ ఇదే ఫార్ములాతో రోగ్ సినిమాను తెరకెక్కించాడు. అక్కడక్కడా పూరి కలం కాస్త మెరిసినా.. ఓవరాల్ పూరి స్టైల్, టేకింగ్ రొటీన్గా అనిపించింది. సునీల్ కశ్యప్ అందించిన పాటలు పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. హీరో, విలన్ క్యారెక్టర్ లకు డిజైన్ చేసిన థీమ్స్ వాళ్ల క్యారెక్టర్స్ను మరింతగా ఎలివేట్ చేశాయి. ముఖేష్ సినిమాటోగ్రఫి, జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. తన్వి ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.



ప్లస్ పాయింట్స్ :
విలన్ క్యారెక్టరైజేషన్,

అనూప్ సింగ్ నటన
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
రొటీన్ టేకింగ్

రోగ్.. రొటీన్ పూరి సినిమా

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement