కొత్తవాళ్లతో కిక్‌ : పూరి | Rogue Movie Success Meet | Sakshi
Sakshi News home page

కొత్తవాళ్లతో కిక్‌ : పూరి

Published Thu, Apr 6 2017 12:02 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

కొత్తవాళ్లతో కిక్‌ : పూరి - Sakshi

కొత్తవాళ్లతో కిక్‌ : పూరి

‘‘తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్‌’ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మా టీమ్‌ అంతా ప్రేక్షకులతో కలసి సినిమా చూశాం. వారి రెస్పాన్స్‌ చూసి చాలా ఎంజాయ్‌ చేశాం’’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇషాన్, మన్నార్‌ చోప్రా, ఏంజెలా హీరో హీరోయిన్లుగా పూరి దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో సీఆర్‌ మనోహర్, సీఆర్‌ గోపి నిర్మించిన ‘రోగ్‌’ గత శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం ‘థ్యాంక్స్‌ మీట్‌’ నిర్వహించారు. పూరి మాట్లాడుతూ– ‘‘ఇషాన్‌ వంటి మంచి హీరోని పరిచయం చేశారంటూ నాకు కొన్ని వందల మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమాకి చాలా మంది కొత్తవాళ్లు పని చేశారు. ప్రతిభ ఉన్న కొత్తవాళ్లతో వర్క్‌ చేస్తే కిక్‌ లభిస్తుంది. ‘రోగ్‌’ని పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.

 ఇషాన్‌ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో మనోహర్, గోపి అన్నయ్యలు యాక్టింగ్‌ కోర్సు నేర్పించారు. నా స్టిల్స్‌ చూసి పూరీగారు ధైర్యంగా నన్ను హీరోగా పరిచయం చేస్తూ, మంచి సినిమా తీశారు. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా పూరీ సార్‌దే ’’ అన్నారు. ‘‘అంజలి వంటి మంచి పాత్ర ఇచ్చిన నా గాడ్‌ఫాదర్‌ పూరీగారికి థ్యాంక్స్‌’’ అని మన్నార్‌ చోప్రా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement