'రోగ్' ఏమయ్యాడు | puri jaganath rogue movie details | Sakshi
Sakshi News home page

'రోగ్' ఏమయ్యాడు

Published Wed, Jun 1 2016 8:30 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

'రోగ్' ఏమయ్యాడు - Sakshi

'రోగ్' ఏమయ్యాడు

జెట్ స్పీడుతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్.. కొద్ది రోజులుగా స్లో అయ్యాడు. వరుస పరాజయాలు పలకరిస్తుండటంతో, నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అదే బాటలో ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాను తన గత చిత్రాల మాదిరిగా కాకుండా నెమ్మదిగా షూటింగ్ చేస్తూ వచ్చాడు.

అయితే తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళుతున్నట్టుగా ప్రకటించిన పూరి, రోగ్ సినిమాకు సంభందించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు ఒక సినిమా రిలీజ్ అయిన తరువాతే తన నెక్ట్స్ సినిమాను ప్రారంబించే పూరి, రోగ్ విషయంలో మాత్రం ఆ సినిమాను పక్కన పెట్టేసి కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. మధ్యలో హీరోయిన్లు హ్యాండ్ ఇవ్వడంతో ఆలస్యం అయిన రోగ్, షూటింగ్ అసలు పూర్తయ్యిందా లేదా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement