పూరితో పటాస్ | kalyan ram gearing up for puri jaganath film | Sakshi
Sakshi News home page

పూరితో పటాస్

Published Wed, Mar 30 2016 6:04 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరితో పటాస్ - Sakshi

పూరితో పటాస్

కెరీర్ లో సక్సెస్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూసిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్, పటాస్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కినా, ఆ తరువాత ఆ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. షేర్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన ఈ నందమూరి అందగాడు, తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అందుకే హీరోయిజాన్ని డిఫరెంట్ యాంగిల్ లో చూపించే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పటాస్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

పూరి కూడా కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించబోయే సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇటీవల తన ఇమేజ్ తగ్గ స్థాయిలో సక్సెస్ లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న పూరి, తిరిగి ఫాంలోకి రావడానికి పక్కా ప్లాన్ వేస్తున్నాడు. ప్రస్తుతం ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఆ సినిమా పూర్తి కాగానే కళ్యాణ్ రామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు కథ కథనాలను రెడీ చేసిన పూరి ప్రస్తుతం డైలాగ్స్ రాసే పనిలో బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement