ism
-
స్క్రిప్ట్ రెడీ.. సెట్స్‌కి వెళ్లడమే ఆలస్యం!
ఓ పక్క తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా నిర్మించబోయే సినిమా పనులతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్.. మరోపక్క తాను హీరోగా నటించనున్న సినిమా కోసం కథలు వింటున్నారు. ‘ఇజం’ తర్వాత పలు కథలు విన్నారాయన. వాటిలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన కథకి కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. స్క్రిప్ట్ కూడా లాక్ చేశారట. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసే జానర్లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ నెల 10న ఎన్టీఆర్ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయట. 15న ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పవన్ సాధినేనితో చేయనున్న సినిమా గురించి కల్యాణ్‌రామ్ ప్రకటిస్తారని భోగట్టా. -
ఊహించని కాంబినేషన్
ఇటు కామెడీ.. అటు యాక్షన్.. వీటికి తోడు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు మేళవించి పసందైన విందు భోజనం లాంటి సినిమా ప్రేక్షకులకు అందించాలనుకునే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘ఇజం’ తర్వాత కల్యాణ్‌రామ్ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ‘దేనికైనా రెడీ’, ‘కరెంట్ తీగ’, ‘ఈడోరకం ఆడోరకం’.. ఇలా ఇటీవల జి.నాగేశ్వరరెడ్డి తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ‘‘దర్శకుడు చెప్పిన కథకు కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ‘దేనికైనా రెడీ’ తరహాలో సాగే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. భారీ సినిమాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాత.. కాస్త విరామం తర్వాత నిర్మించనున్న చిత్రమిది’’ అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అన్నట్లు... ఈ కాంబినేషన్‌ని ఎవరూ ఊహించరు కదూ. ఆ సంగతలా ఉంచితే, ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి తీసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ త్వరలో విడుదల కానుంది. -
పూరి డైరెక్షన్లో లోబడ్జెట్ సినిమా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జెట్ స్పీడుతో సినిమాలు తీసేస్తుంటాడు. ఇతర దర్శకులు కథా చర్చలు పూర్తి చేసే సమయంలో పూరి ఓ సినిమా కంప్లీట్ చేసేస్తాడు. అదే బాటలో పూరి రీసెంట్గా రిలీజ్ చేసిన సినిమా ఇజం. ఈ సినిమాతో పూరి మరోసారి తన మార్క్ చూపించినా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. పూరి నెక్ట్స్ సినిమాపై ఆ ఎఫెక్ట్ భారీగానే పడింది. ఇజం తరువాత మహేష్ బాబుతో జనగణమన సినిమా చేయాలనుకున్నాడు పూరి. అయితే మహేష్ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అవ్వటంతో కుదరలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ ఫైనల్ కాకపోవటంతో ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు రాలేదు. దీంతో మరోసారి పూరికి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అంతా కొత్తవారితో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కథ రాసేపనిలో ఉన్నాడట పూరి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మినిమమ్ బడ్జెట్లో పూర్తి చేసి కమర్షియల్ హిట్‌గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు పూరి. మరి ఈ డాషింగ్ డైరెక్టర్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఇజం
-
'ఇజం' మూవీ రివ్యూ
టైటిల్ : ఇజం జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య, జగపతి బాబు, పోసాని కృష్ణమురళి సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తరువాత విడుదలైన షేర్ సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అందుకే ఈ సారి గ్యారెంటీగా హిట్ కొట్టాలన్న కసితో సరికొత్త మేకోవర్, బాడీ లాంగ్వేజ్‌తో తొలిసారిగా ఓ స్టార్ డైరెక్టర్‌తో కలిసి పని చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్. అనుకున్నట్టుగా హిట్ సాధించాడా..? కథ : పరాయి దేశంలో ఉండి ఇండియాలోని పాలిటిక్స్‌ని బిజినెస్‌లను కంట్రోల్ చేస్తుంటాడు.., జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు). డబ్బు కోసం ఎలాంటి పనులకైనా సిద్ధపడే జావేద్‌కు కూతురు అలియా ఖాన్( అదితి ఆర్య) అంటే ప్రాణం. దేశాన్ని గడగడలాడించే జావేద్ భాయ్‌నే వణికించే వాణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అలియా. అలాంటి లక్షణాలున్న కళ్యాణ్ రామ్ ( కళ్యాణ్ రామ్) స్ట్రీట్ ఫైటర్‌గా అలియాకు పరిచయం అవుతాడు. అలియా, జావేద్ భాయ్ కూతురు అని తెలిసి కూడా ఆమె వెంటపడతాడు కళ్యాణ్. ఈ విషయం తెలుసుకున్న జావేద్, కళ్యాణ్‌ను చంపేయాలనుకుంటాడు. కళ్యాణ్, జావేద్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అదే సమయంలో జావేద్ ఎక్కడుంటున్నాడు అన్న వివరాలతో పాటు, అతనితో సంబంధం ఉన్న బడా నేతల వివరాలు గ్రాండ్ లీకేజ్ కంపెనీ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతాయి. ఎంతో రహస్యంగా ఉన్న జావేద్ భాయ్ వివరాలు బయటకు ఎలా వచ్చాయి. అలియా వెంటపడ్డ కళ్యాణ్ ఎవరు? అతని అసలు పేరేంటి..? గ్రాండ్ లీకేజ్ కంపెనీకి కళ్యాణ్‌కు ఉన్న సంబందం ఏంటి..? చివరకు జావేద్ భాయ్ సామ్రాజ్యం ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : లుక్, బాడీలాంగ్వేజ్లను పూర్తిగా మార్చేసుకొని కొత్త అవతారంలో కనిపించిన కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో స్ట్రీట్ ఫైటర్‌గా అల్లరి పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో మరింతగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాల పాటు సినిమా వన్ మేన్ షోగా నడిచింది. అదితి ఆర్య నటిగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా లుక్స్ పరంగా మాత్రం అలరిస్తుంది. విలన్‌గా జగపతి బాబు మరోసారి సూపర్బ్ అనిపించాడు. దేశాన్ని గడగడలాండిచే కార్పోరేట్ డాన్‌గా స్టైలిష్‌గా కనిపిస్తునే, కూతురి కోసం ఏమైనా చేసే తండ్రిగా మెప్పించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళీ, తనికెళ్ల భరణి లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సినిమా తొలి ఫ్రేం నుంచి ఇది పక్క పూరి మార్క్ సినిమా అన్నట్టుగా తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ముఖ్యంగా తొలి భాగం అంతా పూరి గత సినిమాల ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. హీరోయిన్ వెంటపడి అల్లరి చేసే హీరో, డబ్బు కోసంఎలాంటి పనికైనా సిద్దపడే విలన్ లాంటి క్యారెక్టర్లు గతంలో పూరి సినిమాల్లో కనిపించినవే. దీనికి తోడు తొలి భాగం అంతా అసలు కథలోకి ఎంటర్ అవ్వకుండా హీరో హీరోయిన్ల ప్రేమకథతో నడిపించేయటం కాస్త విసిగిస్తుంది. ఇంటర్వెల్ తరువాత సినిమాలో వేగం పెరుగుతోంది. ముఖ్యంగా జర్నలిస్ట్‌ల కష్టాలు, విలువలు తెలిపేలా పూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. పాటల విషయంలో మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండనిపించింది, ఒక్క సాంగ్ కూడా గుర్తుండిపోయేలా లేదు. పాటలతో నిరాశపరిచినా.. నేపథ్యం సంగీతంతో ఆకట్టుకున్నాడు అనూప్ రుబెన్స్. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోగానే కాక నిర్మాతగానూ సినిమాకు వందశాతం న్యాయం చేశాడు కళ్యాణ్ రామ్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిచ్ గా నిర్మించాడు. ప్లస్ పాయింట్స్ : కళ్యాణ్ రామ్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ పాటలు ఓవరాల్‌గా ఇజం, నటుడిగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచే పూరి మార్క్ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఇజం’ వెనుక ట్రెండీ నిజాలివి..!
నందమూరి నటవారసులలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్న హీరో కల్యాణ్ రామ్. దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్‌రామ్.. ఇప్పటివరకు భారీ సూపర్‌హిట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన తన తాజాచిత్రం ’ఇజం’ ద్వారా సూపర్‌హిట్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్ చిత్రం కోసం కల్యాణ్‌రామ్ ఎంతో కష్టపడ్డారు. సరికొత్త స్టైలిష్ లుక్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా గురించి టెండ్రీ కబుర్లు ఇవి.. కల్యాణ్ రామ్ మేకోవర్! గత సినిమాలకు భిన్నంగా సరికొత్త రూపుతో ‘ఇజం’ సినిమాలో కల్యాణ్ రామ్ కనిపించారు. కొన్ని నెలలపాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ కసరత్తులు చేసి, కండలు పెంచి.. సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. కండల తిరిగిన దేహంతో, సరికొత్త స్టైలిష్ లుక్‌తో కల్యాణ్‌రామ్ ’ఇజం’ ట్రైలర్లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ట్రైలర్లో ఆయన కొత్త లుక్, ఎనర్జీ దుమ్మురేపింది. పూరి మ్యాజిక్! టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. మహేశ్ బాబుతో పోకిరి, బిజినెస్ మ్యాన్, జూనియర్ ఎన్టీఆర్‌తో టెంపర్, రవితేజతో ఇడియట్ వంటి భారీ కమర్షియల్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత పూరిది. కమర్షియల్ సినిమాలు తీయడంతో పూరిని మించినోడు లేడంటే అతియోశక్తి కాదేమో. అలాంటి మ్యాజిక్‌ను ‘ఇజం’ సినిమాలోనూ పూరి రిపీట్ చేసి ఉంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆదితి ఆర్య 2015లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ఎంపికైన అందాల భామ ఆదితి ఆర్యకు ఇది తొలి సినిమా. 2015 మిస్ వరల్డ్ అందాల పోటీలోనూ తను పాల్గొన్నది. కల్యాణ్ రామ్ సరసన టాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ భామ అందచందాల పరంగా ట్రైలర్లో ఆకట్టుకుంది. రంగస్థలం ప్రవేశం ఉండటంతో అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసినట్టు చెప్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ ’ఇజం’ ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉనట్టు తెలుస్తోంది. కారు, బైక్ వంటి ఛేజింగ్ సీన్లతోపాటు పలు యాక్షన్ సీన్లు, మార్షల్ ఆర్ట్స్ పోరాట సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలు తీయడంలో పూరి దిట్ట కావడంతో ‘ఇజం’లో ఆ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాక్షన్ సీన్లతోపాటు ఈ సినిమాలో సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల కల్యాణ్ రామ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సోషల్ ఎలిమెంట్స్ ఉన్న కంప్లీట్ యాక్షన్ సినిమా అయిన ‘ఇజం’ ఈ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించబోతున్నది. -
ఎన్టీఆర్‌లా నటించడం కష్టమన్నాడు : పూరి
‘‘ఫస్ట్ కాపీ చూసిన తర్వాత.. ‘మీకు కోపం వచ్చినా సరే.. మీ కెరీర్లో బెస్ట్ సినిమా ఇదండీ’ అన్నారు నాతో కల్యాణ్‌రామ్. ‘అంతకంటే సంతోషం ఏముంటుంది’ అన్నాను. నిజాయితీ ఉన్న సినిమా ఇది’’... అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చెప్పిన విశేషాలు... పదిహేనేళ్లుగా కంటిన్యూగా సినిమాలు చేసింది నేను, రవితేజ మాత్రమే. ఇప్పుడు తను సినిమా చేసే మూడ్‌లో లేడు. ట్రావెలింగ్‌లో ఉన్నాడు. ప్రపంచమంతా తిరుగుతున్నాడు. నన్ను కూడా సినిమాలు మానేసి తనతో రమ్మంటున్నాడు. (నవ్వుతూ..) మనిద్దరం సినిమా చేద్దామంటే వస్తాడా? చెప్పండి! అవినీతిపై యుద్ధం చేసే ఓ విలేకరి కథే ‘ఇజం’. మనిషి ఉన్నంత వరకూ సమాజంలో అవినీతి అనేది ఉంటుంది. పదేళ్ల క్రితమే ఈ కథ రాశాను. అయితే.. ఈ పదేళ్లలో అవినీతి తీరు మారింది. ఆ మార్పులకు అనుగుణంగా కథను మార్చాను. ‘వికీలీక్స్’ అసాంజ్ స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ రాశాను. నేను తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కి, ఈ కథకీ సంబంధం లేదు. కల్యాణ్‌రామ్‌తో ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే.. జర్నలిస్టుగా నటించే వ్యక్తిలో నిజాయితీ కనిపించాలి. బేసిక్‌గా ఆయనలో ఆ నిజాయితీ ఉంది. సెకండాఫ్‌లో ఫర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ నటుడు పురస్కారం కల్యాణ్‌రామ్‌కే వస్తుందని నా నమ్మకం. జావేద్ భాయ్‌గా జగపతిబాబు, అతడి కూతురిగా హీరోయిన్ అదితీ ఆర్య నటన బాగుంటుంది. హిందీ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, ముంబై వెళ్లి డిస్కషన్స్ చేసి, సినిమా సెట్ కావడానికి ఐదు నెలలు పడుతుంది. ఈలోపు తెలుగులో ఓ సినిమా తీసేయొచ్చు. హిందీలో ‘టెంపర్’ రీమేక్ చేద్దామని అభిషేక్ బచ్చన్‌కి చూపించాను. ‘ఎన్టీఆర్‌లా నటించడం కష్టం. ఆయన చేసిన ఫర్ఫార్మెన్స్ నేను చేయలేను’ అన్నాడు. సమాజంలో క్రమశిక్షణ లేదనే బాధతో ‘జన గణ మన’ కథ రాశాను. మహేశ్‌బాబుకు కథ చెప్పాను. బాగా నచ్చిందన్నారు. కానీ, ఆ తర్వాత రిప్లై ఇవ్వలేదు. ఆ కథతో ఎప్పుడు సినిమా తీస్తానో? ఎవరితో తీస్తానో? చెప్పలేను. అంత ఎందుకు.. పవన్‌కల్యాణ్‌కి ‘పోకిరి’, మరొకరికి ‘ఇడియట్’ కథలు నచ్చలేదు. ప్రతి సినిమాకీ ఓ టైమ్ రావాలి. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలున్నాయి. నిర్మాత సీఆర్ మనోహర్ కుమారుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ‘రోగ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ డిసెంబర్లో విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌తో సినిమాపై ఓ వారంలో స్పష్టత వస్తుంది. మంచి ఎంటర్టైనింగ్ సినిమా అది. -
‘ఇజం’ మూవీ స్టిల్స్
-
తాత సెంటిమెంట్‌ని నమ్ముకున్న నందమూరి హీరో
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగెస్ట్ బడ్జెట్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ నయా సిక్స్ ప్యాక్ హీరో. అదే డేట్ రోజు తన తాత హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు రిలీజ్ అయి ఘనవిజయాలుగా నిలిచాయి. 1955లో జయసింహా, 1970లో కోడలు దిద్దిన కాపురం, 1977లో యమగోల సినిమాలు అక్టోబర్ 21నే రిలీజ్ అయి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఇజం సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు కళ్యాణ్ రామ్ అండ్ టీం. -
నేను ఆ ఇజమ్ను నమ్ముతా!
‘‘వ్యవస్థపై ఓ జర్నలిస్టు చేసిన పోరాటమే ఈ చిత్రకథ. ఎవ్వరికీ హితబోధ చేయట్లేదు. ఓ వ్యక్తి ఫిలాసఫీ, ఐడియాలజీలను చూపిస్తున్నామంతే. సినిమా చూసిన తర్వాత హీరో చేసినట్టు చేస్తే బాగుంటుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మనకు చాలా ‘ఇజం’లున్నాయి. కానీ, మా ‘ఇజం’కు పేరు పెట్టలేదు. చూసిన ప్రేక్షకులే పెట్టాలి’’ అన్నారు నందమూరి కల్యాణ్‌రామ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించి, నిర్మించిన ‘ఇజం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ చెప్పిన విశేషాలు.. ‘పటాస్’ తర్వాత పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలనుకున్నా. అప్పుడాయన దగ్గర కథ లేదు. మళ్లీ కలవగా ‘ఇజం’ కథ చెప్పారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. వికీలీక్స్ అసాంజే తరహా సన్నివేశాలు సినిమాలో ఉంటాయి. బ్లాక్ మనీ, రాజకీయ నాయకులపై సెటైర్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను హ్యూమనిజమ్ను నమ్ముతాను. నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇంత స్టైలిష్‌గా కనిపించలేదు. ‘ఇది కల్యాణ్‌రామ్ మొదటి సినిమానా?’ అనుకునేంతలా... యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, అన్నీ కొత్తగా ఉంటాయి. పూరి కూడా చాలా కొత్తగా తీశారు. ఫస్ట్ డే 500 మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేయాల్సి వచ్చింది. నేను కంగారుపడి.. షూటింగ్ వాయిదా వేద్దామంటే, ‘ఆర్ యూ కాన్ఫిడెంట్? ఆర్ నాట్?’ అని పూరి అడిగారు. ‘యస్..’ అన్నా. ‘అదే స్క్రీన్‌పై చూపించండి’ అన్నారు. ఇప్పటివరకూ నేను చేసిన సీన్స్‌లో బెస్ట్ సీన్ అది. కోర్టు సీన్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకి మందు పూరి హిట్స్‌లో ఉన్నారా? ఫ్లాప్స్‌లో ఉన్నారా? అని ఆలోచించలేదు. ఇండస్ట్రీలో హీరో, దర్శకుడు.. ఎవ్వరికీ గ్యారెంటీ లేదు. ప్రతి సినిమా హిట్టవు తుందనే నమ్మకంతోనే చేస్తాం. ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టి తప్పులను సరి చేసుకోవడమే మా పని. బహుశా.. హీరోలందరిలో చివరగా సిక్స్‌ప్యాక్ చేసింది నేనే అనుకుంట (నవ్వుతూ..) అందుకని, నేను సిక్స్‌ప్యాక్ గురించి మాట్లాడితే బాగోదు. కథ చెప్పినప్పుడు... ‘హీరో మెంటల్‌గా స్ట్రాంగ్. ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉంటేనే క్యారెక్టర్ బాగుంటుంది. మీరు సన్నబడాలి’ అన్నారు పూరి. 86 కేజీలు ఉండేవాణ్ణి. బరువు తగ్గి 74 కేజీలకు వచ్చా. నాకు ఫిష్ ఇష్టం ఉండదు. కానీ, మూడు నెలలు సిక్స్‌ప్యాక్ కోసం అదే తిన్నాను. సిక్స్‌ప్యాక్ చేస్తున్నట్టు ముందు ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. ఆ తర్వాత నాలో వస్తున్న మార్పు చూసి, ‘ఏంట్రా.. బుగ్గలు లోపలకి వెళ్తున్నాయి. నీరసంగా ఉంటున్నావ్’ అనేవారు. వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేశాం. సాయిధరమ్ తేజ్‌తో మల్టీస్టారర్ డిస్కషన్స్‌లో ఉంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. శ్రీమతిపై ప్రేమతో... నా శ్రీమతి పేరు స్వాతి. మా వివాహమై పదేళ్లయింది. ముఖ్యమైన సందర్భాలప్పుడు ఏదో బహుమతి ఇస్తూనే ఉంటా. నేనే ప్రపంచంగా బతుకుతున్న తనపై నా ప్రేమను వ్యక్తం చేయడానికి చేతిపై ఈ టాటూ వేయించుకున్నాను. ఈ టాటూ చూసిన ప్రతిసారి స్వాతి నా కళ్ల ముందు ఉన్నట్టుంటుంది. -
నారా vs నందమూరి
వెండితెర మీద ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమవుతోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు యువ కథనాయకులు బాక్సాఫీస్ ముందు తలపడేందుకు రెడీ అవుతున్నారు. పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. నారా రోహిత్, రెజీనా జంటగా తెరకెక్కిన శంకర సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఈ సినిమాను ఈ సారి ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీంతో వెండితెరపై నారా, నందమూరి హీరోల పోటి తప్పేలా కనిపించటం లేదు. మరి ఈ పోటిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ, సోషల్ హ్యాకింగ్ గ్రూప్ ‘అనానిమస్’ వ్యవస్థల నేపథ్యంలో పూరి చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఓ జర్నలిస్టుకి, ఇంటర్నేషనల్ బ్లాక్ మనీ వ్యవస్థలకు సంబంధం ఏంటి? అతనేం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ సిక్స్‌ప్యాక్ చేశారు. ఆయన లుక్, యాక్టింగ్ స్టైలిష్‌గా ఉంటాయి’’ అని పూరి అన్నారు. -
జీవితంలో ఎవరికీ తలవంచను : హరికృష్ణ
‘‘నా అరవై ఏళ్ల జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలు చూశా. మా నాన్న నందమూరి తారక రామారావుగారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నా అనుభవాలు హిమాలయ పర్వతాలను మించిపోయాయి. ఆయన మాకు వీరాభిమానులను ఇచ్చారు. అభిమానాన్ని ఎవరూ దొంగలించలేరు’’ అని నటులు హరికృష్ణ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. అనూప్ రూబెన్స్ స్వర పరచిన ఈ చిత్రం పాటల సీడీని హరికృష్ణ విడుదల చేసి చిన్న ఎన్టీఆర్‌కు ఇచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ- ‘‘నేనెప్పుడూ మనసులో అనిపించినది బయటకు చెప్పేస్తా. దాచుకోలేను. ఎన్ని దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికీ తలవంచను.. వంచే ప్రశ్నే లేదు. తల వంచేవాడినైతే ఎన్టీఆర్ కడుపున పుట్టేవాణ్ణే కాదు. ఆయన మాకు జీవితం ఇచ్చింది తలవంచి బ్రతకమని కాదు. కృషి చెయ్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ బాటలో నా బిడ్డలు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ ‘ఇజం’ టీజర్ హరికృష్ణగారికి నచ్చడంతో నాకు రెండు పావురాలు బహుమానంగా ఇచ్చారు. ఈ చిత్రం కోసం మూడు నెలల్లో కల్యాణ్ రామ్ 13 కిలోలు బరువు తగ్గాడు. ఇందులో కోర్టు సీన్ హైలెట్’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటి వరకూ పనిచేసిన వాళ్లలో ‘ఇజం’ టీమ్ బెస్ట్. నా కెరీర్లో బెస్ట్ డెరైక్టర్ పూరీనే. ఆయన గురించి సినిమా విడుదల రోజు ఓ గంట మాట్లాడతా. మరోసారి ఇదే టీమ్‌తో పని చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘ ‘టెంపర్’ టైమ్‌లో అన్నయ్యతో(కల్యాణ్ రామ్) ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు పూరీ భయ్యా నాతో అన్నప్పుడు సంతోషపడ్డా. వెంటనే ఫోన్ చేసి అన్నయ్యకు చెప్పా. ‘టెంపర్’ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నయ్య నాకు ఫిలాసఫర్, గైడ్.. ఒక్కోసారి గర్ల్‌ఫ్రెండ్ కూడా. ‘ఇజం’ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో అదితీ ఆర్య, అనూప్ రూబెన్స్, నందమూరి రామకృష్ణ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, నటులు తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజ్, అలీ, పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామేన్ ముఖేష్, ‘ఆదిత్య’ నిరంజన్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇజం ఆడియో హైలైట్స్
-
'ఇజం' ఆడియో విడుదల
-
అక్టోబర్ 5న 'ఇజం' ఆడియో
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం. కళ్యాణ్ రామ్ సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్న ఈ సినిమాను ముందుగా దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు దసరా బరిలో భారీ కాంపిటీషన్ ఏర్పడటంతో ఇజం రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇజం సినిమా ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అక్టోబర్ 5 సాయంత్రం గ్రాండ్‌గా ఇజం ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబందించి ఆడియో రిలీజ్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు పూరి. తొలిసారిగా కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు మరో బిగ్ హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్. -
పూరి దగ్గర చాలా కళలున్నాయ్
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోని అన్ని రంగాల మీద పట్టు చూపిస్తున్నాడు. ఇప్పటికే కథా రచయితగా, మాటల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, కాస్టింగ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న పూరి.., తాజాగా తనలోని మరిన్ని కళల్ని చూపిస్తున్నాడు. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన బిజినెస్‌మేన్ సినిమాలో ఓ పాటకు గొంతు కలిపిన పూరి, తన తాజా చిత్రంలో రెండు పాటలు పాడాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఈ సినిమాలో రెండు పాటలు పాడాడు. ఎయ్ ఎయ్ ఎయ్రా అంటూ సాగే పాటతో పాటు ఇజం టైటిల్ సాంగ్‌కు గొంతు కలిపాడు. అంతేకాదు, ఇప్పటి వరకు కథలు, మాటలు మాత్రమే రాసిన ఈ స్టార్ డైరెక్టర్, ఈ సినిమాతో గేయ రచయితగా కూడా మారిపోయాడు. ఇజం టైటిల్ సాంగ్‌ను తానే స్వయంగా రాశాడు పూరి. అనూప్ రుబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలోని మిగతా పాటలను పూరి, ఆస్థాన రచయిత భాస్కరబట్ల రాశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాజీ మిస్ ఇండియా అదితి ఆర్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను అక్టోబర్‌లో, సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బైలింగ్యువల్ సినిమా రోగ్. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్న ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ సమయంలోనూ హీరోయిన్ల మార్పుతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది రోగ్. తాజాగా ఇజం షూటింగ్ చివరి దశకు రావటంతో మరోసారి రోగ్ సినిమా పేరు వార్తల్లోకి వచ్చింది. పూరి ఇజం రిలీజ్ తరువాత రోగ్ పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టనున్నాడట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఎలాగైన ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇషాన్ సరసన పూజా జవేరి, మన్నార చోప్రాలు హీరోయిన్లుగా నటించారు. -
తమ్ముణ్ని విలన్ని చేస్తోన్న పూరి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా, 143 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా.. స్టార్ ఇమేజ్ సాధించే స్ధాయి హిట్స్ మాత్రం రావటం లేదు. దీంతో తమ్ముడి కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు పూరి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, త్వరలో సాయిరాం శంకర్ కీలక పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో సాయి హీరోగా కాదు, విలన్‌గా నటించనున్నాడట. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న ఈ సినిమాతో సాయిని నెగిటివ్ రోల్లో పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో విలన్ రోల్స్‌లో చేసిన చాలా మంది.. హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సాయి కూడా విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తిరిగి హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడు. -
వేసవి బరిలో జూనియర్
జనతా గ్యారేజ్ ఘనవిజయం సాధించటంతో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ నిర్మాణంలో సినిమా చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త దర్శకుడితో ప్రయోగం చేయటం కన్నా సీనియర్ దర్శకుడితో సినిమా చేయటమే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఇటీవల రిలీజ్ అయిన ఇజం టీజర్‌కు మంచి స్పందన రావటంతో తన నెక్ట్స్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేయాలని భావిస్తున్నాడట. ఇజం షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో అక్టోబర్‌లో ఎన్టీఆర్, పూరిల సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి వచ్చే వేసవినాటికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. -
కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చాడు కళ్యాణ్ రామ్, ప్రస్తుతం మాస్ హీరో ఇమేజ్ కోసం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాను చేస్తున్నాడు. పూరి మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం తొలిసారిగా సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఇజం టైటిల్‌లోగో తో పాటు కళ్యాణ్ రామ్ లుక్‌ను రివీల్ చేస్తూ పలు పోస్టర్లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం కళ్యాణ్ రామ్ తండ్రి, ప్రముఖ నటుడు హరికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న ఈ లుక్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. There you go.. A new poster from #ISM. Hope you like it pic.twitter.com/Ra8DigNmEq— KALYANRAM NANDAMURI (@NANDAMURIKALYAN) 2 September 2016 -
క్లిష్టత పెరిగినా.. ఫలితాల్లో హవా
నిట్లు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశించడానికి.. అదే విధంగా అత్యున్నత విద్యకు వేదికలుగా నిలిచే ఐఐటీలు, ఐఎస్ఎం (ధన్‌బాద్)లో సీట్లను పొందేందుకు వీలుకల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి జేఈఈ మెయిన్ మార్కులు కీలకం. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలు, అడ్వాన్స్డ్ రాయడానికి కటాఫ్ మార్కులు తదితరాలపై స్పెషల్ ఫోకస్.. 13.57 లక్షలు.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2014కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు. 1,22,863.. ఈ పరీక్షకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య. (దాదాపు పది శాతం) 1.54 లక్షలు.. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. ఈసారి విద్యార్థినుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఉత్తీర్ణుల్లో 28,666 మంది విద్యార్థినులున్నారు. మరోసారి రాష్ట్ర విద్యార్థుల ప్రతిభ: గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ, జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో టాప్ మార్కులు, ర్యాంకులతో ప్రతిభ కనబరుస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఈ ఏడాది కూడా అదే హవా కొనసాగించారు. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో 355 మార్కులతో రాష్ట్రానికి చెందిన వాకచర్ల ప్రమోద్ మొదటి స్థానంలో నిలవగా.. మహమ్మద్ అక్రమ్ ఖాన్ అనే మరో విద్యార్థి 350 మార్కులతో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. గత ఏడాది కూడా జేఈఈ-మెయిన్ మార్కుల విషయంలో మన రాష్ట్ర విద్యార్థులే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక.. మొత్తం ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల శాతానికి సంబంధించి ప్రస్తుత సమాచారం ప్రకారం మొత్తం ఉత్తీర్ణుల్లో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య 30 వేల నుంచి 35 వేల మధ్యలో ఉంటుందని అంచనా. ‘సీబీఎస్ఈ సిలబస్‌కు సరితూగేలా ఇంటర్మీడియెట్ సిలబస్‌లో మార్పులు తేవడం, కెమిస్ట్రీ ప్రశ్నలు గత ఏడాదితో పోల్చితే కాసింత సులభంగా ఉండటం, మరోవైపు విద్యార్థుల్లోనూ ప్రాక్టికల్ అప్రోచ్ పెరగడమే ఈ ఫలితాలకు కారణమని’ పోటీ పరీక్షల నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న మార్కులు: జేఈఈ పరీక్ష క్లిష్టత ఏటా పెరుగుతున్నప్పటికీ.. విద్యార్థులు సాధిస్తున్న మార్కుల సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఐఐటీ-జేఈఈకి బదులు.. జేఈఈ మెయిన్ - అడ్వాన్స్డ్ అనే కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన 2013తో పోల్చినా అత్యధిక మార్కుల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. గత ఏడాది అత్యధిక మార్కులు 345. కాగా, ఈ ఏడాది అత్యధిక మార్కులు 355. అదే విధంగా గత ఏడాది రెండో స్థానంలో 341 మార్కులు నిలవగా.. ఈ ఏడాది అవి 350కి పెరిగాయి. కటాఫ్‌లలోనూ పెరుగుదల: ఒకవైపు మార్కులు పెరుగుతున్నట్లే.. జేఈఈ-అడ్వాన్స్డ్ కు కటాఫ్ మార్కులు కూడా పెరుగుతున్నాయి. జనరల్ కేటగిరీ నుంచి అన్ని వర్గాల వరకు ఈ కటాఫ్‌లు గత ఏడాది కంటే పెరిగాయి. వివరాలు.. కేటగిరీ 2014 కటాఫ్ 2013 కటాఫ్ జనరల్ 115 113 ఓబీసీ 74 70 ఎస్సీ 53 50 ఎస్టీ 47 45 ఆప్షన్లలో దోషాలు.. అదనపు మార్కులు: ఈ ఏడాది ఫలితాల విషయంలో ప్రధానంగా గమనించాల్సిన అంశం.. ఆయా ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో లోపాల కారణంగా విద్యార్థులందరికీ అదనపు మార్కులు కేటాయించినట్లు సీబీఎస్ఈ ప్రకటించడం. ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఒక ప్రశ్నకు; అదే విధంగా ఏప్రిల్ 19న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో మూడు ప్రశ్నలకు ఆప్షన్లు సరిగా లేవని.. సీబీఎస్ఈ విడుదల చేసిన ‘కీ’ ఆధారంగా పలువురు విద్యార్థులు ఆరోపించిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆఫ్‌లైన్‌లో హాజరైన విద్యార్థులకు నాలుగు, ఏప్రిల్ 19న ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు 12 మార్కులు అదనంగా కేటాయించినట్లు .. మెయిన్ ఫలితాల వెల్లడి సమయంలో సీబీఎస్ఈ చైర్మన్ వినీత్ జోషి ప్రకటించారు. ప్రతి మార్కు కీలకంగా నిలిచే జేఈఈలో అదనపు మార్కులు కేటాయించడం ర్యాంకుల విషయంలోనూ ప్రభావం చూపుతుంది. తొలుత 1.5 లక్షల మందికి: ప్రస్తుతం మెయిన్‌లో మార్కులు.. ఆయా కేటగిరీల్లో ప్రకటించిన కటాఫ్ ర్యాంకుల ఆధారంగా తొలుత 1.5 లక్షల మందికి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకునేందుకు అర్హత లభించింది. వీరంతా 9వ తేదీ వరకు అడ్వాన్స్డ్ పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అడ్వాన్స్డ్ పరీక్ష తదుపరి దశలో ఎంపిక క్రమంలో.. మూడు విధానాలను అనుసరిస్తారు. అవి.. జేఈఈ మెయిన్‌లో పొందిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షల్లో పొందిన మార్కులకు 40 శాతం వెయిటేజీ కల్పిస్తూ తొలి జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత నార్మలైజేషన్ ద్వారా మెయిన్ తుది జాబితా సిద్ధం చేస్తారు. ఈ జాబితా ఆధారంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశాలు పొందొచ్చు. తర్వాత దశలో ఐఐటీలు, ఐఎస్ఎం (ధన్‌బాద్)ల్లో ప్రవేశానికి.. అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంతోపాటు ఆయా బోర్డ్ పరీక్షల్లో టాప్ 20 పర్సెంటైల్‌లో ఉండాలి. గత ఏడాది గణాంకాలు.. ఈ ఏడాది మెయిన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది కూడా టాప్-20 పర్సెంటైల్‌లో మన రాష్ట్ర విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది టాప్-20 పర్సెంటైల్ జాబితాను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 91.8 శాతం మార్కులకే ఈ జాబితా పూర్తికాగా.. తమిళనాడు బోర్డ్ 90.9 శాతంతో, తర్వాత స్థానంలో కేరళ 85.2 శాతంతో నిలిచాయి. జేఈఈ - మెయిన్ మార్కులు.. ర్యాంకుల అంచనా: ఇంటర్మీడియెట్ తత్సమాన బోర్డ్ మార్కులు, జేఈఈ మెయిన్ మార్కులు, నార్మలైజేషన్ ఆధారంగా పర్సెంటైల్ గణించి జూలై 7న ఆలిండియా ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెయిన్‌లో పొందిన మార్కులు.. వాటికి లభించే ర్యాంకులపై అంచనా.. జేఈఈ మెయిన్ మార్కులు ర్యాంకు అంచనా 320 పైన 100 లోపు 290 - 310 100 నుంచి 200 270 - 290 200 నుంచి 550 250 - 270 550 నుంచి 1000 లోపు 240 - 250 1000 నుంచి 1500 220 - 240 1500 నుంచి 3500 210 - 220 3500 నుంచి 4000 200 - 210 4000 నుంచి 5500 190 - 200 5500 నుంచి 7000 185 - 190 7000 నుంచి 7700 180 - 185 7700 నుంచి 8000 175 - 180 8000 నుంచి 9500 170 - 175 9500 నుంచి 10000 160 - 170 10 వేల నుంచి 12 వేలు గత ఏడాది కామన్ మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంకుకు లభించిన మార్కులు 332. కాగా, చివరి ర్యాంకు విద్యార్థికి లభించిన మార్కులు 156. దీని ప్రకారం మెయిన్‌లో అత్యధిక మార్కులు పొందినా.. నార్మలైజేషన్ తర్వాత ర్యాంకుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. అడ్వాన్స్డ్ మార్కుల ఆధారంగా 15 ఐఐటీలు, ఐటీ-బీహెచ్‌యూ, ఐఎస్ఎం-ధన్‌బాద్‌లలో లభించే సీట్లు - 9,885. వీటిలో అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,341 సీట్లు అందుబాటులో ఉండగా.. అత్యల్పంగా ఐఐటీ-మండి, ఇండోర్, రోపార్ క్యాంపస్‌లలో 120 చొప్పున ఉన్నాయి. జేఈఈ-మెయిన్ మార్కులతో లభించే సీట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు - 15,500 సీట్లు పుల్ ఐటీలు - 850 ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు - 15 వేలు అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి మెయిన్‌లో మార్కులు తెలిశాయి. ఇంటర్మీడియెట్ బోర్డ్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా నిర్ణయించిన టాప్-20 పర్సెంటైల్‌లో నిలవడం అనే విషయంలో అంచనా వచ్చి ఉంటుంది. కాబట్టి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఇక మే 25న నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌పై దృష్టి పెట్టాలి. రెండు రోజుల వ్యవధిలో ఎంసెట్, అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్న తరుణంలో ఈ రెండింటి సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు, మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెయిన్ పరీక్ష సరళిని పరిశీలిస్తే ప్రాక్టీస్, పేపర్- వర్క్ అవసరమైన ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే తరహా ప్రశ్నలు కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఫిజిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. జేఈఈ - 2014 మే 2 అర్ధరాత్రి జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. 1,50,000 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ మే 25, 2014 (ఆఫ్‌లైన్) 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉంటే ఐఐటీలు, ఐఎస్ఎం - ధన్బాద్లో సీటు కేటాయిస్తారు పరీక్ష రాసిన విద్యార్థులందరికీ జేఈఈ మెయిన్‌కు 60 శాతం, ఇంటర్‌కు 40 శాతం వెయిటేజీతో జూలై 7న ర్యాంక్ కేటాయిస్తారు నిట్స్, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో సీటు కేటాయిస్తారు -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రజల స్పందన
-
ఇజంలో నిజమెంత
-
త్వరలో ‘ఇజం’ పేరుతో పవన్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: జనసేన పార్టీ భావజాలాన్ని తెలియజేస్తూ సినీ నటుడు పవన్‌కల్యాణ్, రాజు రవితేజతో కలసి రచించిన ‘ఇజం(ఐడియాలజీ ఆఫ్ జనసేన పార్టీ)’ పుస్తకం త్వరలో ప్రజల ముందుకు రానుంది. దీనిని త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. ‘జనసేన’కు అధికార ప్రతినిధులు లేరు ‘జనసేన’కు అధికార ప్రతినిధులు ఎవ్వరూ లేరని ఆ పార్టీ కార్యాలయం ఆదివారం ఓ పత్రికా ప్రకటనతో తెలిపింది. ప్రస్తుతం పవన్ ఒక్కరే అధికారికంగా మాట్లాడతారని, మీడియా చర్చల్లో ఎవరు పాల్గొని మాట్లాడినా అవి వారి వ్యక్తిగత అభిప్రాయమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.