పూరి డైరెక్షన్లో లోబడ్జెట్ సినిమా | Low budget film from puri jagannath | Sakshi
Sakshi News home page

పూరి డైరెక్షన్లో లోబడ్జెట్ సినిమా

Published Tue, Nov 1 2016 3:31 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరి డైరెక్షన్లో లోబడ్జెట్ సినిమా - Sakshi

పూరి డైరెక్షన్లో లోబడ్జెట్ సినిమా

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జెట్ స్పీడుతో సినిమాలు తీసేస్తుంటాడు. ఇతర దర్శకులు కథా చర్చలు పూర్తి చేసే సమయంలో పూరి ఓ సినిమా కంప్లీట్ చేసేస్తాడు. అదే బాటలో పూరి రీసెంట్గా రిలీజ్ చేసిన సినిమా ఇజం. ఈ సినిమాతో పూరి మరోసారి తన మార్క్ చూపించినా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. పూరి నెక్ట్స్ సినిమాపై ఆ ఎఫెక్ట్ భారీగానే పడింది.

ఇజం తరువాత మహేష్ బాబుతో జనగణమన సినిమా చేయాలనుకున్నాడు పూరి. అయితే మహేష్ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అవ్వటంతో కుదరలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ ఫైనల్ కాకపోవటంతో ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు రాలేదు. దీంతో మరోసారి పూరికి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందుకే అంతా కొత్తవారితో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన కథ రాసేపనిలో ఉన్నాడట పూరి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మినిమమ్ బడ్జెట్లో పూర్తి చేసి కమర్షియల్ హిట్గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు పూరి. మరి ఈ డాషింగ్ డైరెక్టర్ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement